MP Chamala Kiram Kumar Reddy | అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు తేలితే అధికారులకు రాసిస్తా
MP Chamala Kiram Kumar Reddy | తన పేరిట అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ఆరోపణలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి( MP Chamala Kiram Kumar Reddy ) స్పందించారు. నాపేరు మీద అసైన్డ్ భూములు ఉంటే గుండు రావు నిరుపించాలి అని సవాల్ విసిరారు.
కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ చామల
MP Chamala Kiram Kumar Reddy | త్రినేత్ర న్యూస్ : తన పేరిట అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ఆరోపణలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి( MP Chamala Kiram Kumar Reddy ) స్పందించారు. నాపేరు మీద అసైన్డ్ భూములు ఉంటే గుండు రావు నిరుపించాలి అని సవాల్ విసిరారు. గాంధీ భవన్లో బుధవారం ఎంపీ చామల మీడియాతో మాట్లాడారు.
నాపై వస్తున్నవి ఆరోపణలు మాత్రమే. వాళ్ళ భూ బాగోతం తెలంగాణ ప్రజలకు తెలియజేశాను కాబట్టే నన్ను టార్గెట్ చేశారు. నాకు అసైన్డ్ ల్యాండ్ ఉంటే వాటి దగ్గరకు వెళ్లండి. అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నట్లు తేలితే అక్కడే అధికారులకు రాసిస్తా. గుండు రావు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. నేను వాళ్ల ఫామ్హౌజ్ల బాగోతం బయట పెట్టాను కాబట్టే నాపై గుండు రావు కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. మీ ఆర్టిస్టుల తెలివి తేటలు మా దగ్గర చూపించకండి. ప్రజా క్షేత్రానికి వెళ్లి వాస్తవాలు తెలియజేయండి. ఏమైన సలహాలు ఉంటే మాకు ఇవ్వండి అని చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫామ్ హౌజ్లో బందీ
స్వేరో పేరుతో వీరవిహారం చేసిన వ్యక్తి కుక్కలాగా మొరుగుతున్నారు. ఒక వ్యక్తి నా ఫ్లెక్సీ కట్టినట్లు, అతన్ని నేను రాహుల్ గాంధీని కలిసినట్లు ఏఐ ఫోటో క్రియేట్ చేశారు. ఏనుగు ఎక్కి ప్రగతి భవన్కు వెళ్తా అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఫామ్ హౌజ్లో బందీ అయ్యారు. తెలంగాణ సమాజానికి నన్ను విలన్గా చూపించాలని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడారు అని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
- ●Jailer 2 | ‘జైలర్ 2’పై తగ్గిన బజ్.. బాక్సాఫీస్ వద్ద రజనీ మ్యాజిక్ పనిచేసేనా?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు బ్రేక్.. సెన్సెక్స్ 252 పాయింట్లు డౌన్..
- ●Palamuru Lift Irrigation | పాలమూరు ఎత్తిపోతల.. బాహుబలి మోటార్లు ప్రారంభం
- ●Bhadradri Kothagudem | శవయాత్రలో పేలిన టపాసులు.. నలుగురికి తీవ్ర గాయాలు
- ●Bhatti Vikramarka | మూడేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 1,64,431 కోట్లు జమ..
- ●Cockroach Janata Party | కాక్రోచ్లకు ఫండింగ్ చేస్తున్నారు.. ఎవరో తెలుసా?

Jailer 2 | ‘జైలర్ 2’పై తగ్గిన బజ్.. బాక్సాఫీస్ వద్ద రజనీ మ్యాజిక్ పనిచేసేనా?

Stock Markets | స్టాక్ మార్కెట్లకు బ్రేక్.. సెన్సెక్స్ 252 పాయింట్లు డౌన్..

Palamuru Lift Irrigation | పాలమూరు ఎత్తిపోతల.. బాహుబలి మోటార్లు ప్రారంభం

Bhadradri Kothagudem | శవయాత్రలో పేలిన టపాసులు.. నలుగురికి తీవ్ర గాయాలు



