త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Addanki Dayaker | నీటి దొంగలు నీతులు చెప్తున్నారు.. బీఆర్ఎస్ నేత‌ల‌పై అద్దంకి ద‌యాక‌ర్ ఫైర్

Addanki Dayaker | రాష్ట్రంలో నీటి దొంగ‌లే నీతులు చెప్తున్నార‌ని బీఆర్ఎస్ నేత‌ల‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ నిప్పులు చెరిగారు. మూడు నెల‌లు స‌మ‌యం ఇవ్వు అంటున్నావ్.. ఐదేళ్లు మంత్రిగా ఉన్న‌ది నువ్వే క‌దా..? అని హ‌రీశ్‌రావును ఉద్దేశించి ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Jul 12, 2026, 6.56 pm IST

Addanki Dayaker | నీటి దొంగలు నీతులు చెప్తున్నారు.. బీఆర్ఎస్ నేత‌ల‌పై అద్దంకి ద‌యాక‌ర్ ఫైర్
Advertisement

Addanki Dayaker | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో నీటి దొంగ‌లే నీతులు చెప్తున్నార‌ని బీఆర్ఎస్ నేత‌ల‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ నిప్పులు చెరిగారు. మూడు నెల‌లు స‌మ‌యం ఇవ్వు అంటున్నావ్.. ఐదేళ్లు మంత్రిగా ఉన్న‌ది నువ్వే క‌దా..? అని హ‌రీశ్‌రావును ఉద్దేశించి ప్ర‌శ్నించారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆదివారం అద్దంకి ద‌యాక‌ర్ మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని మేడిగ‌డ్డ బ్యారేజీ నింపితే కూలిపోతుందంటే.. లేదు నీళ్లు నింపు అంటున్నావు మెంటల్ ఎక్కిందా.. మ్యాప్ వేసి చూసినా..మ్యాడ్ ఫెలోకి అర్థం అవ్వడం లేదు. హరీష్ రావు... సోల్లు కబుర్లు మాట్లాడకుఅని ధ్వ‌జ‌మెత్తారు. పంపు హౌస్.. నీళ్ళు ఉన్న దగ్గర పెట్టాలి. రిటైర్డ్ ఇంజనీర్‌లు ఇచ్చిన నివేదిక ఎందుకు పక్కన పెట్టిండు మీ మామ. మూడు నెలలు ఇవ్వు అంటున్నావు.. ఐదేళ్లు మంత్రిగా ఉన్నది నువ్వే క‌దా..? ఇంట్లో పండిన వాడు రాడు. బయటకు వచ్చిన వాడికి తెలివి లేదాయే. కేసీఆర్ ఆనవాళ్లు కాదు... వైఎస్ ఆనవాళ్లు చెరిపే కుట్ర చేసింది మీరు అని అద్దంకి దుయ్య‌బ‌ట్టారు.

నాగార్జున సాగర్ నిర్మించి ఎన్ని ఏండ్లు అయ్యింది.. క‌నీసం కుంగ‌లేదు. ఇసుక మీద పిల్లర్లు కట్టి.. ఇప్పుడు నీళ్లు నింపు అంటాడు. బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కూడా స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఈయ‌న అటు పోతడో.. ఆయ‌న ఇటు వ‌స్త‌డో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని అద్దంకి పేర్కొన్నారు.

Advertisement
Advertisement