Komatireddy Rajagopal Reddy | ఏదుల నుంచి మునుగోడుకు నీళ్లు తరలించాల్సిందే.. రాజీపడే ప్రసక్తే లేదు
Komatireddy Rajagopal Reddy | ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ రక్కసితో ఇబ్బందిపడుతున్న మునుగోడు( Munugode ) నియోజకవర్గ ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Rajagopal Reddy ) తేల్చిచెప్పారు.
రిటైర్డ్ ఇంజినీర్లతో తేల్చిచెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajagopal Reddy | త్రినేత్ర న్యూస్ : ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ రక్కసితో ఇబ్బందిపడుతున్న మునుగోడు( Munugode ) నియోజకవర్గ ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Rajagopal Reddy ) తేల్చిచెప్పారు. పాలమూరు ఎత్తిపోతలలో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి మునుగోడు నియోజకవర్గానికి నీళ్లు తరలించాల్సిందే అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం డిండి సాగునీటి ఎత్తిపోతల పథకంతో పాటు ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తరలించే పనులు, మునుగోడు నియోజకవర్గంలోని లక్ష్మణాపురం, శివన్నగూడెం ప్రాజెక్టుల కింద ఉన్న హెడ్ వర్క్స్ పనులకు సంబంధించి తెలంగాణ రిటైర్ట్ ఇంజినీర్ల ప్రతినిధులతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్ష చేశారు.

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా డిండి ఎత్తిపోతల పథకానికి, దీనికి కొనసాగింపుగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలోని లక్ష్మణాపురం, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీటిని ఎక్కడి నుండి తరలించాలనే విషయంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన చొరవతో ఏదుల రిజర్వాయర్ నుండి నీటి తరలించాలని నిర్ణయించింది. వాటికి సంబంధించిన పనులకు గాను రూ. 1800 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తరలించాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా భూ సేకరణ, హెడ్ వర్క్స్ పనులతో పాటు సంబంధిత అన్ని పనులు పూర్తయ్యే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతానని రిటైర్ట్ ఇంజినీర్ల ఫోరం ప్రతినిధులకు ఎమ్మెల్యే తెలిపారు. ఏదుల రిజర్వాయర్ నుండి నీటి తరలింపుపై కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ రక్కసితో ఇబ్బందిపడుతున్న మునుగోడు నియోజకవర్గ ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, సలహాదారులు వి.వెంకటరామారావు, ఎం.సత్తిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జగదీశ్వర్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Charan Koushik Yadav | కాంగ్రెస్ అకౌంట్లో 900 కోట్లుంటే.. బీఆర్ఎస్ అకౌంట్లోకి 1500 కోట్లు ఎట్లొచ్చినయ్
అక్టోబర్ 11, 2026

Nagarigari Preetham | కేటీఆర్! మేం బ్లడ్ శాంపిల్స్ ఇస్తున్నం.. డాక్టర్లను మీ ఇంటికీ పంపుతున్నం
అక్టోబర్ 11, 2026

Minister Vivek | హైదరాబాద్ – మియోషి సిస్టర్ సిటీ స్నేహ బంధానికి 20 ఏళ్లు
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●Charan Koushik Yadav | కాంగ్రెస్ అకౌంట్లో 900 కోట్లుంటే.. బీఆర్ఎస్ అకౌంట్లోకి 1500 కోట్లు ఎట్లొచ్చినయ్
- ●Ramachander Rao | క్యాన్సర్ రోగులకు ఏటా రూ. 2,500 కోట్ల ఆదా..!
- ●Rakul Preet Singh | అలనాటి దిగ్గజ హీరోయిన్గా రకుల్ - ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ఛాన్స్
- ●Samsung | ఫోన్ వాడితే తలనొప్పా? Galaxy S27 Ultraలో కొత్త ఫీచర్!
- ●IndiGo Flight Emergency Landing Hyderabad | విమానంలో పేలిన పవర్ బ్యాంక్.. హైదరాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్
- ●Jantar Mantar Protest Site | నిరసనలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జంతర్ మంతర్ కాలం చెల్లిందా?

Charan Koushik Yadav | కాంగ్రెస్ అకౌంట్లో 900 కోట్లుంటే.. బీఆర్ఎస్ అకౌంట్లోకి 1500 కోట్లు ఎట్లొచ్చినయ్

Ramachander Rao | క్యాన్సర్ రోగులకు ఏటా రూ. 2,500 కోట్ల ఆదా..!

Rakul Preet Singh | అలనాటి దిగ్గజ హీరోయిన్గా రకుల్ - ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ఛాన్స్

Samsung | ఫోన్ వాడితే తలనొప్పా? Galaxy S27 Ultraలో కొత్త ఫీచర్!



