MLA Anirudh Reddy | తెలంగాణ బిడ్డలను ముట్టుకుంటే.. గో బ్యాక్ ఆంధ్రా ఉద్యమం తప్పదు.. పవన్ కళ్యాణ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరిక
MLA Anirudh Reddy | తెలంగాణ బిడ్డలను ముట్టుకుంటే.. మళ్లా గో బ్యాక్ ఆంధ్రా ఉద్యమం తప్పదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్టు చేసే ముందు దమ్ముంటే నన్ను కూడా అరెస్టు చేయాలని ఏపీ ప్రభుత్వానికి అనిరుధ్ సవాల్ విసిరారు.
MLA Anirudh Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ బిడ్డలను ముట్టుకుంటే.. మళ్లా గో బ్యాక్ ఆంధ్రా ఉద్యమం తప్పదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్టు చేసే ముందు దమ్ముంటే నన్ను కూడా అరెస్టు చేయాలని ఏపీ ప్రభుత్వానికి అనిరుధ్ సవాల్ విసిరారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదు. నాగేశ్వర్ చదువుకున్న వ్యక్తి.. రాజకీయ విశ్లేషకులు.. మాజీ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం కాదు.. ఆయన కాలి గోటికి కూడా సరిపోడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్. చంద్రబాబు ప్యాకేజ్ ఇచ్చిండు కాబట్టి ఆయన తోటి ఉన్నడు. మళ్లీ అమిత్ షా దగ్గరికి పోయి మాట్లాడుకున్నడేమో ప్యాకేజ్. నాగేశ్వర్‌ను అరెస్టు చేయాలనుకుంటున్నారు కదా.. ఆయన ఇంటి ముందు నేను నిలబడుతా.. ఆయనను అరెస్టు చేసే ముందు నన్ను అరెస్టు చేయండి దమ్ముంటే. తెలంగాణ బిడ్డలను ముట్టుకోవాలని ఎవరైనా ఆంధ్రా నుంచి మీరు వస్తే మళ్లా గో బ్యాక్ ఆంధ్రా అని మేం స్టార్ట్ చేసినం అంటే మీరు ఇక్కడ ఉండలేరు అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.
మీరంతా తెలంగాణలోనే ఉంటున్నరు కదా.. అన్ని పైసలు పెట్టి అమరావతిని ఎందుకు కట్టుకుంటున్నరు. ఆ పైసలేదో మాకు ఇవ్వండి.. జడ్చర్లలో 5 వేల ఎకరాలు ఇస్తా. 99 ఏండ్లకు లీజు ఇస్తా. ఇక ఇక్కడ్నే ఉన్నట్టు ఉంటది.. ఇక్కడ్నుంచే ఆంధ్రాను పాలించినట్టు ఉంటది మీకు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు మా తెలంగాణోళ్లపైన. ఇంకో డౌట్ కూడా వస్తుంది.. రేపు జగన్ ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆయనకు సపోర్ట్ చేస్తాడేమో అనే డౌట్ కూడా ఉందని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల






