త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

V Hanumantha Rao | రాహుల్ ప్ర‌ధాని కావాలంటే.. నేను ఢిల్లీలో ఉండాలే.. వీహెచ్ కీల‌క వ్యాఖ్య‌లు

V Hanumantha Rao | రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావాలంటే.. నేను ఢిల్లీలో ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని వీహెచ్ త‌న మ‌న‌సులో ఉన్న కోరిక‌ను బ‌య‌టపెట్టారు.

S

Telangana | Published On Feb 28, 2026, 7.01 pm IST

V Hanumantha Rao | రాహుల్ ప్ర‌ధాని కావాలంటే.. నేను ఢిల్లీలో ఉండాలే.. వీహెచ్ కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

V Hanumantha Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావాలంటే.. నేను ఢిల్లీలో ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని వీహెచ్ త‌న మ‌న‌సులో ఉన్న కోరిక‌ను బ‌య‌టపెట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్ద‌ల‌ను కలిసిన అనంత‌రం వీహెచ్ మీడియాతో మాట్లాడారు.

న‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని కాంగ్రెస్ అధిష్టానం పెద్ద‌ల‌ను క‌లిసి విన్న‌వించాను. నాకు న్యాయం చేస్తార‌నే న‌మ్మ‌కం విశ్వాసం ఉంది. నాకు రెండు సార్లు అన్యాయం జ‌రిగినా.. నేను పార్టీ కండువా మోస్తున్నాను. ప‌దేళ్ల నుంచి ఖ‌మ్మంలోనే ప‌ని చేస్తున్నాను. రాజీవ్ గాంధీ విగ్ర‌హం కూడా పెట్టాను. రాజీవ్ గాంధీ ఖ‌మ్మం ప్రాంతానికి రెండుసార్లు వ‌చ్చి గిరిజ‌నులు, రైతుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. కాబ‌ట్టి ఖ‌మ్మంలో రాజీవ్ గాంధీ ఆలోచ‌నా విధానాన్ని అమ‌లు చేయాల‌నే కృత నిశ్చ‌యంతో ప‌ని చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి, టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ నాకు న్యాయం చేస్తార‌ని న‌మ్మ‌కం ఉందని వీహెచ్ తెలిపారు.

నేష‌న‌ల్ నెట్ వ‌ర్క్‌లో నాకు మంచి ప‌రిచ‌యాలు ఉన్నాయి. ఏపీలోనూ కూడా నాకు ఫాలోవ‌ర్స్ ఉన్నారు. రాహుల్ గాంధీని ప్ర‌ధాని చేయాలంటే.. నేను ఢిల్లీలో ఉంటే అన్ని రాష్ట్రాల్లో తిరుగుతా. నాకు అన్ని రాష్ట్రాల్లో మంచి ప‌రిచ‌యాలు ఉన్నాయి. ఉర్దూ, హిందీ మాట్లాడుతాను కాబ‌ట్టి.. అంద‌ర్నీ స‌మ‌న్వ‌యం చేయ‌గ‌లుగుతాను అని హ‌నుమంత‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement