Mynampally Hanumanth Rao | కాంగ్రెస్‌కు ఓటేయాలని మైనంపల్లి హన్మంతరావు బెదిరింపులు.. వీడియోలు
Mynampally Hanumanth Rao | కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ప్రచారం సమయం ముగిసినా కూడా సోమవారం రాత్రి 9 గంటల తర్వాత రామాయంపేటలో పర్యటించారు. రామాయంపేటలోని కాలనీల్లో యాక్టివాపై తిరుగుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ బెదిరింపులకు గురి చేశారు మైనంపల్లి.
Mynampally Hanumanth Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. దీంతో ఆయా పార్టీలు తమ ప్రచారపర్వాన్ని ముగిశాయి. కానీ అక్కడక్కడ కొంత మంది నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి తమ ప్రచారాన్ని కొనసాగించారు.
అయితే కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ప్రచారం సమయం ముగిసినా కూడా సోమవారం రాత్రి 9 గంటల తర్వాత రామాయంపేటలో పర్యటించారు. రామాయంపేటలోని కాలనీల్లో యాక్టివాపై తిరుగుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ బెదిరింపులకు గురి చేశారు మైనంపల్లి. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. ఇక మైనంపల్లి యాక్టివాను మరో బైక్‌లు ఫాలో అయ్యాయి. మరో వ్యక్తి ఈ మూడు బైక్‌లను అనుసరిస్తూ పరుగెత్తాడు. ఆ వ్యక్తి మైనంపల్లి వ్యక్తిగత భద్రతా సిబ్బంది అని తెలుస్తోంది.
ఇక మైనంపల్లి గల్లీగల్లీ స్కూటీపై తిరిగిన దృశ్యాలు.. ఆయా గల్లీల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైనంపల్లి హన్మంతరావు తీరుపై స్థానికులతో పాటు మిగతా పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ గల్లీల్లో తిరుగుతూ ఓటర్ల ప్రలోభపెట్టి భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి బెదిరింపులకు పాల్పడిన మైనంపల్లి హన్మంతరావు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు ఈ దృశ్యాలు కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు.
[video width="960" height="1080" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-09-at-10.25.41-PM.mp4"][/video]
[video width="960" height="1080" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-09-at-10.25.42-PM.mp4"][/video]
[video width="960" height="1080" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-09-at-10.25.43-PM.mp4"][/video]
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



