Mettu Sai Kumar | మన్నె క్రిశాంక్‌పై కఠిన చర్యలు తీసుకోండి
Mettu Sai Kumar | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి అని హైదరాబాద్ క్రైమ్ డీసీపీ చైతన్య కుమార్‌కు ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ క్రైమ్ డీసీపీకి మెట్టు సాయికుమార్ ఫిర్యాదు
Mettu Sai Kumar | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి అని హైదరాబాద్ క్రైమ్ డీసీపీ చైతన్య కుమార్‌కు ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫిర్యాదు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డిపై ఆస్తులు, ఫార్మా కంపెనీలకు సంబంధించి ఆరోపణలు చేస్తున్న వారిని విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నైమిషా రెడ్డికి చెందినవిగా పేర్కొంటూ కొన్ని ఆస్తులు, ఫార్మా కంపెనీలపై ఆరోపణలు ప్రచారంలోకి వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం కూతురిపై చేస్తున్న ఆ ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించాలి. తప్పుడు, కల్పిత, తప్పుదారి పట్టించే లేదా ఆధారాలు లేనివిగా తేలితే, వాటికి బాధ్యులైన వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని, తప్పుడు సమాచారాన్ని సృష్టించిన లేదా ప్రచారం చేసిన వ్యక్తులను గుర్తించాలని కోరారు. నేరం రుజువైతే సంబంధిత వ్యక్తులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరారు. ఈ అంశంపై నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరిపి చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో మెట్టు సాయి విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ponnam vs Adi Srinivas | కబడ్డీ ఆడిన మంత్రులు పొన్నం, ఆది శ్రీనివాస్..
- ●Suicide | చున్నీతో ఉరేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్
- ●Horoscope | అక్టోబర్ 6 రాశిఫలాలు.. ఈ రాశి ప్రేమికుల మధ్య అపార్థాలు..!
- ●Telangana CEO Form 7 Order | ఓట్ల తొలగింపునకు నకిలీ ఫారం-7 కుట్ర: బల్క్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం కొరడా.. సెక్షన్ 31 కింద కేసులకు ఆదేశం
- ●Bheemgal SI Tirupati | పీఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం: ఎస్సై వేధింపులే కారణమంటూ వేముల ఫైర్.. రేపు 'భీమ్‌గల్ బంద్'కు పిలుపు
- ●Justice PS Koshy Telangana High Court | హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ పీఎస్ కోషి: సుప్రీంకోర్టుకు జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్

Ponnam vs Adi Srinivas | కబడ్డీ ఆడిన మంత్రులు పొన్నం, ఆది శ్రీనివాస్..

Suicide | చున్నీతో ఉరేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్

Horoscope | అక్టోబర్ 6 రాశిఫలాలు.. ఈ రాశి ప్రేమికుల మధ్య అపార్థాలు..!

Telangana CEO Form 7 Order | ఓట్ల తొలగింపునకు నకిలీ ఫారం-7 కుట్ర: బల్క్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం కొరడా.. సెక్షన్ 31 కింద కేసులకు ఆదేశం





