Jaggareddy | జీవన్ రెడ్డిని గౌరవించండి.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
Jaggareddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డిని గౌరవించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలోనూ కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉన్న జీవన్ రెడ్డికి తగిన గౌరవం ఇచ్చే విధంగా పార్టీ అధిష్ఠానాన్ని జగ్గారెడ్డి కోరారు.
Jaggareddy | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డిని గౌరవించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలోనూ కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉన్న జీవన్ రెడ్డికి తగిన గౌరవం ఇచ్చే విధంగా పార్టీ అధిష్ఠానాన్ని జగ్గారెడ్డి కోరారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌కు, పీసీసీ చీఫ్‌కు మీడియా ద్వారా తెలియజేస్తున్నా. జీవన్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారు. కాంగ్రెస్ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ,ఎమ్మెల్సీగా పార్టీలోనే ఉన్నాడు.రాజకీయంగా జీవన్ రెడ్డికి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న జీవన్ రెడ్డికి అవమానం జరగకుండా ఇంఛార్జి నటరాజన్, పీసీసీ చీఫ్‌లు చొరవ చూపాలి. జీవన్ రెడ్డికి గౌరవం వచ్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వారిని కోరుతున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు.
జీవన్ రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని కిమ్స్ దవాఖానకు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, వెంటనే హాస్పిటల్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆయనకు పాయిజన్ అయినట్లు చెప్పారు. జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఇప్పటివరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేదు.
కాగా, గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసిన జీవన్ రెడ్డి ఓడిపోయారు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీచేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. దీంతో ఆయన తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. క్రమంగా పార్టీలో ఆయన ప్రాధాన్యమూ తగ్గుతూ వచ్చింది. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో జీవన్‌రెడ్డి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. తనతోపాటు, తన మద్దతుదారులకు పార్టీలో గుర్తింపు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగానే సీఎం రేవంత్ రెడ్డిని, పార్టీ అధిష్ఠానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల మున్సిపాలిటీలో తన మద్దతుదారులను 14న మందిని కౌన్సిలర్లుగా గెలిపించుకున్నారు. తన వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అయినప్పటికీ పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే వర్గానికే చైర్మన్ పదవి, జీవన్‌రెడ్డి వర్గానికి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చి.. ఆయనను బుజ్జగించింది. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురవడం గమనార్హం.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



