త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సెల్యూలర్ జైలులో ఖైదు కాబడ్డ తొలి యోధుడెవరో తెలుసా… | G Chinnareddy

G Chinnareddy | తెలంగాణ చ‌రిత్ర‌ను పున‌ర్నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు జి చిన్నారెడ్డి నొక్కిచెప్పారు. శుక్రవారం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో " స్టార్మింగ్ ధ బ్రిటిష్ రెసిడెన్సీ " అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

S

Telangana | Published On Jul 17, 2026, 6.23 pm IST

సెల్యూలర్ జైలులో ఖైదు కాబడ్డ తొలి యోధుడెవరో తెలుసా…  |  G Chinnareddy
Advertisement

G Chinnareddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ చ‌రిత్ర‌ను పున‌ర్నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు జి చిన్నారెడ్డి నొక్కిచెప్పారు. శుక్రవారం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో " స్టార్మింగ్ ధ బ్రిటిష్ రెసిడెన్సీ " అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యులు టి. వివేక్, చరిత్ర ప్రొఫెసర్ డాక్టర్ కె. పద్మ రచించిన "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం - సంక్షోభ సంవత్సరాలు" అనే పుస్తకాన్ని చిన్నారెడ్డి ఆవిష్క‌రించారు.

2009-2014 మధ్య జరిగిన, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకమైనవిగా పరిగణించబడే అనేక నమోదు కాని వాస్తవాలు, సంఘటనలను రచయితలు వెలుగులోకి తీసుకువచ్చినందుకు చిన్నారెడ్డి వారిని అభినందించారు. తెలంగాణ చరిత్ర నిర్మాణంలో ఉన్న లోటును ఈ గ్రంథం పూరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్రను పునర్నిర్మించాల్సిన అవసరాన్ని చిన్నారెడ్డి నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేందుకు కార్పొరేట్ రంగం తమ సీఎస్ఆర్ నిధులను కేటాయించాలని సూచించారు. 2009-2014 మధ్య జరిగిన, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకమైనవిగా పరిగణించబడే అనేక నమోదు కాని వాస్తవాలు, సంఘటనలను రచయితలు వెలుగులోకి తీసుకువచ్చినందుకు చిన్నారెడ్డి వారిని అభినందించారు. తెలంగాణ చరిత్ర నిర్మాణంలో ఉన్న లోటును ఈ గ్రంథం పూరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

1857 జూలై 17న తుర్రేబాజ్ ఖాన్ దేశ భక్తి గల కొంత మంది ధైర్యవంతుల బృందానికి నాయకత్వం వహించి బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారని గుర్తు చేశారు. ఇది డెక్కన్‌లో జరిగిన ప్రసిద్ధ సిపాయిల తిరుగుబాటుకు ప్రతిధ్వనిగా నిలిచిందని, ఈ సంఘటనను ఇప్పటికి మనం జరుపుకోవడానికి కారణం గతం నుండి స్ఫూర్తి పొందడం కోసమేనని, ఇది చరిత్ర విధి అని చిన్నారెడ్డి పేర్కొన్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలను అనుమతించలేదని ఆయన గుర్తు చేశారు. నల్గొండకు చెందిన మౌల్వి అల్లావుద్దీన్‌తో కలిసి తుర్రేబాజ్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారన్నారు. తెలంగాణ నుంచి అండమాన్‌లోని ‘కాలాపాని’ అని పిలువబడే సెల్యూలర్ జైలులో ఖైదు కాబడ్డ తొలి యోధుడు మౌల్వి అల్లావుద్దీన్ అని చిన్నారెడ్డి తెలిపారు.

ఈ సెమినార్‌లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ తెలంగాణ స్టడీస్ డైరెక్టర్ కెప్టెన్ (డాక్టర్) ఎల్. పాండు రంగా రెడ్డి, మహిళా యూనివర్సిటీ వీసీ సూర్య ధనుంజయ, పుస్తక రచయితలు టి. వివేక్, డాక్టర్ కె. పద్మ, చరిత్ర ప్రొఫెసర్ డాక్టర్ పి. అరుణ, చరిత్ర విభాగాధిపతి, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఆర్. సురేందర్ రెడ్డిని సత్కరించారు.

Advertisement
Advertisement