Balka Suman | క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహించండి: బాల్క సుమన్
Balka Suman | పెద్దపల్లి జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఎలాంటి గొడవలు లేకుండా, ప్రజా తీర్పును గౌరవిస్తూ సజావుగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) డిమాండ్ చేశారు.
Balka Suman | త్రినేత్ర.న్యూస్: పెద్దపల్లి జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఎలాంటి గొడవలు లేకుండా, ప్రజా తీర్పును గౌరవిస్తూ సజావుగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారని చెప్పారు. కాంగ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా.. మంత్రి వివేక్ అధికార దుర్వినియోగంతో ఎన్నో అరాచకాలు, ప్రలోభాలు పెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు తలొగ్గలేదన్నారు. తమపై రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. మంత్రి వివేక్ చెక్ బుక్ తీసుకెళ్లి తమ నేతలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తనను జైలుకు పంపారని, క్యాతనపల్లిని రావణ కాష్టం చేశారని మండిపడ్డారు. కౌన్సిలర్లకు మూడు కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారన్నారని చెప్పారు. 51 రోజులుగా ఊరికి దూరంగా, పండుగలకు దూరంగా ఉన్నామన్నారు. ప్రజాస్వామ్యన్ని హత్య చేస్తున్నారని విమర్శించారు. క్యాతనపల్లిలో వందల మంది పోలీసులు మోహరించారని వెల్లడించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని కోరారు.
అంతకుముందు మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ రోజని చెప్పారు. క్యాతనపల్లి సహా మూడు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంటుందని స్పష్టం చేశారు. క్యాతనపల్లి కౌన్సిలర్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. మంత్రి వివేక్ ప్రజల తీర్పును వివేక్ గౌరవించాలని, ప్రజాస్వామ్యన్ని కాపాడాలని చెప్పారు. పోలీసులను పెట్టి అడ్డుకుంటే సహించేదిలేదని స్పష్టం చేశారు. క్యాతనపల్లిలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా వివేక్ చూడాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



