Koppula Eshwar | సింగరేణిని నామరూపాల్లేకుండా చేసేందుకు కుట్ర : కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar | సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. రామగుండం ఆర్జీ-1, ఓసీపీ-5లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, టీజీబీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి బొగ్గు నిల్వలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Koppula Eshwar | సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. రామగుండం ఆర్జీ-1, ఓసీపీ-5లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, టీజీబీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి బొగ్గు నిల్వలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చూపిస్తున్న బొగ్గు నిల్వల లెక్కల వాస్తవాలను వివరించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో వరుస కుంభకోణాలతో సంస్థనే ప్రశ్నార్థకం చేసేలా దోపిడీ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కుంభకోణాలకు తెరలేపుతోందని ఆరోపించారు. ఒకప్పుడు సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలోని అనేక మంది పేదలకు ఉద్యోగాలు కల్పించి, లక్షల కుటుంబాలకు జీవనోపాధి చూపించిందని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఓబీ కాంట్రాక్టులు, సోలార్ పవర్ ప్లాంట్లు, డెటోనేటర్ కాంట్రాక్టులు, పవర్ ప్రాజెక్టుల విషయంలో కుంభకోణాల పరంపర కొనసాగుతోందని విమర్శించారు.
అధికారిక లెక్కలు, సింగరేణి వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం సంస్థ వ్యాప్తంగా వివిధ గనుల వద్ద 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోందన్నారు. ఆర్జీ-1, ఓసీపీ-5లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, ప్రస్తుతం 3.60 లక్షల టన్నులు ఉన్నాయని చెబుతున్నారని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మట్టి పెల్లలు, బండలు, పనికిరాని వ్యర్థాలను కుప్పలుగా వేసి వాటినే బొగ్గుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ 50 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు కూడా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. సింగరేణి సంస్థను సర్వనాశనం చేయడంతో పాటు కార్మికుల జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నేతృత్వంలోనే అనేక అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బొగ్గు నిల్వలు ఎక్కడెక్కడ చూపిస్తున్నారో అక్కడ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, లేని బొగ్గును ఎలా సృష్టించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజాధనాన్ని వృథా చేయడంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో ఈ ఉదంతం ద్వారా అర్థమవుతోందన్నారు. సింగరేణి ప్రజల ఆస్తి అని, దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఇటీవల గోదావరిఖనికి వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, అందులో ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగాల అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు. 400 మంది కార్మికులను అన్‌పిట్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని హరీష్ రావు వెల్లడించారని పేర్కొన్నారు. ఈ విషయం బయటకు వస్తే పరువు పోతుందని భావించిన అధికారులు రెండు రోజుల్లో కార్మికులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించేందుకు సిద్ధమవుతున్నారన్నారు. సింగరేణిలో చోటుచేసుకుంటున్న వరుస కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Madras High Court | కూలాలకతీతంగా ఓటేయగలమని తమిళ ప్రజలు నిరూపించారు : మద్రాస్ హైకోర్టు
జూన్ 12, 2026

Supreme Court | మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోండి.. సివిల్ సర్వెంట్లు రోహిణి సింధూరి, రూపా కేసులో సుప్రీం వ్యాఖ్యలు..!
జూన్ 12, 2026

Singareni | యథావిధిగా సింగరేణి మెడికల్ బోర్డు.. రేపు 335 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
జూన్ 12, 2026
తాజావార్తలు
- ●FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్లోనే అదరగొట్టిన మెక్సికో
- ●KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్
- ●Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్లను కట్ చేసే భూతమే ‘సర్’: పొంగులేటి
- ●KTR | వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవు.. ఒంటరి పోరే.. తేల్చిచెప్పిన కేటీఆర్
- ●Mining 4.0 | సురక్షితమైన మైనింగ్ కార్యకలాపాలకు పరిశ్రమలు సహకరించాలి : MEAI చైర్మన్ వినయ్ కుమార్
- ●Natasha Singh | టాలీవుడ్ హీరోయిన్గా మిస్ ఇండియా ఫైనలిస్ట్ - ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్లోనే అదరగొట్టిన మెక్సికో

KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్

Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్లను కట్ చేసే భూతమే ‘సర్’: పొంగులేటి

KTR | వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవు.. ఒంటరి పోరే.. తేల్చిచెప్పిన కేటీఆర్



