Congress | రాహుల్ అరెస్టుకు నిరసనగా.. నేడు కాంగ్రెస్ చలో లోక్‌భవన్
Congress | నీట్ పేపర్ లీక్ (NEET paper leak) వ్యవహారంపై ప్రధాని నివాసం వద్ద ఆకస్మిక ధర్నాకు దిగిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా కాంగ్రెస్ (Congress) నేతల అరెస్టును ఖండిస్తూ ఏఐసీసీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.
Congress | త్రినేత్ర.న్యూస్: నీట్ పేపర్ లీక్ (NEET paper leak) వ్యవహారంపై ప్రధాని నివాసం వద్ద ఆకస్మిక ధర్నాకు దిగిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా కాంగ్రెస్ (Congress) నేతల అరెస్టును ఖండిస్తూ ఏఐసీసీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ చలో లోక్ భవన్ (Lok Bhavan) కార్యక్రమం నిర్వహించనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలను లోక్‌భవన్ వెళ్లనున్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనున్నారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టుకు నిరసనగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అర్ధరాత్రి భారీ ధర్నా నిర్వహించారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్ల చౌరస్తా వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర పభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
తాజావార్తలు
- ●Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్
- ●Punjab Paper Leak | పంజాబ్‌లో పేపర్ లీక్ చిచ్చు: విద్యా శాఖ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్
- ●CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!
- ●Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ
- ●BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై చర్చించే ఛాన్స్..!
- ●Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య

Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్

Punjab Paper Leak | పంజాబ్‌లో పేపర్ లీక్ చిచ్చు: విద్యా శాఖ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్

CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!

Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ






