త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | గెలుపుకోసం ఒక్క‌టైన‌ మూడు పార్టీలు.. జెండాలు, కండువాలు లేకుండానే ప్ర‌చారం..

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: అవును ఆ మూడు పార్టీలు ఒక్క‌ట‌య్యాయి. ఓ స్వ‌తంత్ర అభ్య‌ర్థిని (Independent candidate) ఓడించ‌డానికి మూడు పార్టీలు చేతులు క‌లిపాయి.

G

Telangana | Published On Feb 5, 2026, 6.36 am IST

Municipal Elections | గెలుపుకోసం ఒక్క‌టైన‌ మూడు పార్టీలు.. జెండాలు, కండువాలు లేకుండానే ప్ర‌చారం..
Advertisement

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: అవును ఆ మూడు పార్టీలు ఒక్క‌ట‌య్యాయి. ఓ స్వ‌తంత్ర అభ్య‌ర్థిని (Independent candidate) ఓడించ‌డానికి మూడు పార్టీలు చేతులు క‌లిపాయి. ఒక్క‌టిగానే ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ విచిత్ర ప‌రిస్థితి భువ‌న‌గిరి (Bhuvanagiri) మున్సిపాలిటీలోని (Municipal Elections) 14వ వార్డులో చోటుచేసుకున్న‌ది.

ప‌ట్ట‌ణంలోని 14వ వార్డు కౌన్సిల‌ర్‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవాల‌ని ప్ర‌జ‌లు అనుకున్నారు. దానికి ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఒప్పుకున్నాయి. అయితే మ‌రో వ్య‌క్తి కూడా నామినేష‌న్ దాఖ‌లు చేశాడు. దీంతో పోటీ అనివార్య‌మైంది. ప్ర‌జ‌ల అభ్య‌ర్థ‌న‌తో మూడు పార్టీలు ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చాయి. ఉమ్మ‌డిగా స్వ‌తంత్ర అభ్య‌ర్థిని బ‌రిలో నిలిపాయి. అత‌నికి మ‌ద్ద‌తుగా అంతా క‌లిసి ప్ర‌చారం కూడా నిర్వ‌హిస్తున్నారు. అయితే నాయకులు, కార్య‌క‌ర్త‌లు త‌మ పార్టీల‌ జెండాలు, కండువాలు ఉప‌యోగించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement