త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gas Cylinder Price | దీపావ‌ళి పండుగ వేళ షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర

Gas Cylinder Price | దీపావ‌ళి (Diwali) పండుగ వేళ ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ ధరలను (Gas Cylinder Price) పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

G

National | Published On Nov 1, 2026, 8.30 am IST

Gas Cylinder Price | దీపావ‌ళి పండుగ వేళ షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర
Advertisement

Gas Cylinder Price | త్రినేత్ర న్యూస్‌: దీపావ‌ళి (Diwali) పండుగ వేళ ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ ధరలను (Gas Cylinder Price) పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. 19 కిలోల‌ వాణిజ్య సిలిండర్ (Commercial Gas Cylinder) ధ‌ర‌ను దేశీయ చ‌మురు కంపెనీలు స్వ‌ల్పంగా పెంచాయి. తాజా ధ‌ర‌ల‌తో ఢిల్లీలో (Delhi) రూ.10 పెర‌గ‌డంతో రూ.2,820కి చేరుకుంది. ఇక ముంబైలో రూ.10 పెరిగి రూ.2,774.50,కోల్‌కతాలో రూ.10 పెరిగి రూ.2,964కు చేరుకోగా.. చెన్నైలో రూ.11.50 పెరిగి రూ.2,994.50కు లభిస్తున్న‌ది. హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే రూ.3000 దాటిన క‌మర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర‌.. తాజా పెంపుతో రూ.3,100కు చేరువైంది. గ‌త నెల ఒక్కో సిలిండ‌ర్‌పై రూ.69 వ‌డ్డించిన విష‌యం తెలిసిందే.

కాగా, గృహావ‌స‌రాల‌కు వినియోగించే 14 కిలోల సిలిండ‌ర్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేక‌పోవ‌డంతో కాస్త ఊర‌ట ల‌భించింది. గ‌త ఐదు నెల‌లుగా డొమెస్టిక్ సిలిండ‌ర్ (Domestic Gas Cylinder) ధ‌ర‌ల‌ను స‌వ‌రించ‌లేదు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో రూ.994గా ఉంది. కాగా, వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో పండుగ‌కి స్వీట్ల ధరలపై ప్రభావం చూపనుంది. స్వీట్ల ధరలు పెరిగే అవకాశముంది.

ట్యాగ్స్:

Commercial Gas CylinderDomestic Gas CylinderGas Cylinder PriceLPG CylinderPrice Hike
Advertisement
Advertisement