LPG cylinder | మరోసారి పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర.. మూడు నెలల్లో రెండోసారి
LPG cylinder | ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో మంట పెట్టింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ (LPG cylinder) ధరను మళ్లీ పెంచింది.
LPG cylinder | త్రినేత్ర.న్యూస్: ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో మంట పెట్టింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ (LPG cylinder) ధరను మళ్లీ పెంచింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. 14 కిలోల సిలిండర్ ధరను రూ.29 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర (Domestic LPG cylinder) పెరగడం ఇది రెండోసారి.
తాజా పెంపుతో ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.913 నుంచి రూ.942కు చేరింది. హైదరాబాద్‌లో రూ.965 నుంచి రూ.994కి పెరిగింది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని సాకుగా చూపి మార్చి 7న గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60 వడ్డించిన విషయం తెలిసిందే.
కాగా, గత కొన్నివారాలుగా సిలిండర్ ధరలు మాత్రమే కాకుండా ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మే రెండో వారం నుంచి లీటరు పెట్రోల్, డీజిల్ రూ.8, సీఎన్‌జీ కిలోకు రూ.6 చొప్పున పెరిగాయి. ఇక వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెల పెరుగుతూనే ఉన్నది.
తాజావార్తలు
- ●Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?
- ●Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
- ●Horoscope | జూలై 28 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు..!
- ●Morning Phone Habit | పొద్దున్నే లేవగానే మొబైల్ చూస్తున్నారా? ఇది అడిక్షన్ కాదట.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు!
- ●Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?

Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

Horoscope | జూలై 28 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు..!

Morning Phone Habit | పొద్దున్నే లేవగానే మొబైల్ చూస్తున్నారా? ఇది అడిక్షన్ కాదట.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు!






