LPG Cylinder Price | గ్యాస్ సిలిండర్ ధర.. దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే ఎక్కువ!
LPG Cylinder Price | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు (LPG Cylinder Price) పెరిగాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై దేశీయ చమురు కంపెనీలు రూ.29 పెంచాయి.
LPG Cylinder Price | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు (LPG Cylinder Price) పెరిగాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై దేశీయ చమురు కంపెనీలు రూ.29 పెంచాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.942కు చేరింది. అయితే దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే (Hyderabad) ఈ ధర అధికంగా ఉన్నది. భాగ్యనగరంలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.994కు చేరింది. అతి తక్కువగా బెంగళూరులో (Bengaluru) రూ.915.50గా ఉంది.
అయితే దేశంలోనే అత్యధికంగా బీహార్ రాజధాని పట్నాలో (Patna) ఉన్నది. అక్కడ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1031కు చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర కూడా ఈ రెండు నగరాల్లో అధికంగా ఉండటం గమనార్హం. హైదరాబాద్‌లో రూ.3,357గా ఉండగా, పట్నాలో రూ.3400లు.
ఇక్కడ తక్కువ..
ఇక బెంగళూరుతోపాటు సిలిండర్ ధరలు అతి తక్కువగా నోయిడాలో రూ.939.50, ముంబైలో రూ.941.50, ఢిల్లీలో రూ.942, జైపూర్‌లో రూ.945.50 ఉంది.
మెట్రో నగరాల్లో వంటగ్యాస్ ధరలు..
- న్యూఢిల్లీ- రూ.942
- ముంబై- రూ.941.50
- కోల్‌కతా- రూ.968
- చెన్నై- రూ.957.50
- బెంగళూరు- రూ.915.50
- హైదరాబాద్- రూ.994
సిలిండర్ ధర రూ.950 దాటిన నగరాలు..
- లక్నో- రూ.979.50
- కోల్‌కతా- రూ.968
- చెన్నై- రూ.957.50
- ఛండీగఢ్- రూ.951.50
- గుర్‌గావ్- రూ.950.50
హైదరాబాద్‌లో ఎందుకు ఎక్కువ..?
సిలిండర్ ధరలు దేశం మొత్తం ఒకేలా ఎందుకు ఉండవు అనే సందేహం రావచ్చు. అయితే చమురు ఉత్పత్తులపై ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా పన్నులు వసూలు చేస్తున్నాయి. దీంతో ధరల్లో కూడా మార్పులు ఉంటాయి. అదేవిధంగా హైదరాబాద్‌లో కూడా స్థానిక పన్నులు, రవాణా, పంపిణీ వ్యయాల ప్రభావం సిలిండర్ ధరలపై ఉంటుంది. దీంతో ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర అధికమవుతున్నది.

తాజావార్తలు
- ●TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
- ●South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా
- ●Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?
- ●Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
- ●Horoscope | జూలై 28 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు..!
- ●Morning Phone Habit | పొద్దున్నే లేవగానే మొబైల్ చూస్తున్నారా? ఇది అడిక్షన్ కాదట.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు!

TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు

South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా

Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?

Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత



