Black Magic | హరీశ్‌రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు.. ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన రేవంత్
Black Magic | బీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుపై క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు విజయ భారతి సాయనీకి వినతిపత్రం అందజేశారు.
Black Magic | బీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుపై క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు విజయ భారతి సాయనీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిపై క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపణలు చేయడం తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ గాంధీభవన్ వేదికగా హరీశ్‌రావు శివమొగ్గ, తిరుచ్చిరాపల్లిలో క్షుద్ర పూజలు నిర్వహించారని, తెలంగాణలో వర్షాలు పడకుండా, రైతులు నష్టపోయేలా చేసేందుకే ఆ పూజలు చేశారని ఆరోపించారని రేవంత్ తెలిపారు. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలను బహిర్గతం చేయలేదన్నారు. ఇదే తరహాలో ఎమ్మెల్సీ అడ్డంకి దయాకర్ సైతం హరీశ్‌రావుపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.
గ్రామీణ తెలంగాణలో ఇప్పటికీ క్షుద్ర పూజలు, చేతబడి వంటి మూఢనమ్మకాల కారణంగా అమాయక ప్రజలు హింసకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ప్రజాప్రతినిధులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ ప్రయత్నాలను దెబ్బతీసేలా ఉందన్నారు. మూఢనమ్మకాల ఆధారంగా జరిగే హింసను నిరోధించేందుకు ప్రజాప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలను పరిశీలించాలని కోరుతూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచేలా కాకుండా, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సిన అవసరం ఉందని న్యాయవాది రేవంత్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
ఆగస్టు 6, 2026

Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
ఆగస్టు 6, 2026

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ



