త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cold Wave | తెలంగాణ‌లో చలి పంజా.. సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్ర‌త‌లు ప‌రిమితం..!

Cold Wave | తెలంగాణ వ్యాప్తంగా చ‌లి గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ప‌లు జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. దీంతో వృద్ధులు, పిల్ల‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

S

Telangana | Published On Dec 8, 2025, 5.34 pm IST

Cold Wave | తెలంగాణ‌లో చలి పంజా.. సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్ర‌త‌లు ప‌రిమితం..!
Advertisement

Cold Wave | హైద‌రాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా చ‌లి గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ప‌లు జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. దీంతో వృద్ధులు, పిల్ల‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శేరిలింగంప‌ల్లి ప‌రిధిలోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో 8.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ఈ ఉష్ణోగ్ర‌త‌లు ఆదివారం సాయంత్రం నుంచి సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు కొన‌సాగాయి.

న‌గ‌రంలోని రాజేంద్ర‌గ‌న‌ర్‌లో 10.1 డిగ్రీలు, అల్వాల్, బీహెచ్ఈఎల్‌లో 10.6, ఆర్సీపురంలో 12.2, నేరెడ్‌మెట్‌లో 12.4, చందాన‌గ‌ర్‌లో 12.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్ల‌డించింది.

ఇక తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో 6.6 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెల్సియ‌స్ మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్య‌ల్పంగా 6.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 6.8, వికారాబాద్‌లో 7.8, కామారెడ్డిలో 8.2, నిజామాబాద్‌లో 8.4, నిర్మ‌ల్ జిల్లాలో 9 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.

ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, మెద‌క్, నిర్మ‌ల్, మెద‌క్ జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో 5 డిగ్రీల సెల్సియ‌స్ నుంచి 11 డిగ్రీల సెల్సియ‌స్ మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. మిగ‌తా జిల్లాల్లో 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మ‌ధ్య న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది.

మ‌రో రెండు రోజుల పాటు అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతాయ‌ని అధికారులు హెచ్చ‌రించారు. సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో వృద్ధులు, చిన్నారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. శ్వాసకోశ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు వెచ్చ‌ని ప్ర‌దేశాల్లో ఉండాల‌ని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement