Hitler – HYDRAA | హిట్లర్, హైడ్రా అన్న మాటలు రేవంత్ ఇమేజ్‌ను పూర్తిగా డిమాలిష్ చేసేశాయి..!
Hitler - HYDRAA | సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బెంగళూరు వేదికగా చేసిన 'హిట్లర్, హైడ్రా' వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే?
మాజీ సంపాదకులు కే శ్రీనివాస్ ఫేస్‌బుక్ వాల్ నుంచి
గ్రౌండ్ జీరో !
చాలా విషయాలు మాట్లాడారు రేవంత్ అక్కడ! ఢిల్లీ ముందు రెండో తరగతి పౌరులుగా ఉండాలా అని అడిగాడు, ఆడవాళ్ల పేరుతో డిలిమిటేషన్ రాజకీయాలు చేయొద్దని అన్నారు! ఇంటి దగ్గర నుంచి పిక్ అప్ చేసుకోవడమే ప్రైవేట్ స్కూళ్ల విజయరహస్యం అన్నారు, స్కూళ్ల సంఖ్య 75 శాతం తగ్గిస్తా అన్నారు!
పైవాటిలో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసేవి చాలా ఉన్నాయి! వాటన్నిటి గురించి చర్చ జరగాలి! కానీ హిట్లర్, హైడ్రా - అన్న మాటలు అందరినీ హుక్ చేశాయి! సహజమే!
అన్ని విషయాలు అందరికీ తెలియాలని లేదు, కానీ, ఏదో తెలిసినట్టుగా మాట్లాడే కృత్రిమ ప్రయత్నంలో భంగపాటు కలుగుతుంది. ఎంతో కొంత ప్రపంచ జ్ఞానం, ప్రజాజీవితానికి సంబంధించిన ఇంగితం, డిసెన్సీ తో వ్యవహరించాలన్న పట్టింపు లేకపోతే, నోటికి వచ్చింది మాట్లాడతారు, పరువు తీసుకుంటారు!
వాళ్ల పరువే కాదు, వాళ్ళు ప్రాతినిధ్యం వహించే జనాల పరువు కూడా తీస్తారు! అంత హీనపు మాటలు మాట్లాడినప్పుడు, పక్కనే ఉన్న సుప్రసిద్ధ పాత్రికేయుడు ఏమనుకున్నాడో, అక్కడున్న విశిష్ట ప్రేక్షకులు ఎట్లా నవ్వుకున్నారో, ఈయనను ఎన్నుకున్న ప్రజల విచక్షణ గురించి ఎంత తక్కువగా లెక్కవేశారో అని సిగ్గుగా అనిపించింది!
మొన్ననే కదా ఒకరు తెలంగాణను పాకిస్థాన్ తో పాలస్తీనాతో పోల్చినందుకు బాధపడుతూ నవ్వుకున్నాం! తెలంగాణా తో పోలిక సంగతి పక్కన పెడితే ఆయనకు పాకిస్థాన్ ను పాలస్తీనాను ఒక గాట కట్ట కూడదని తెలియదు! ఇప్పుడు అతనిని మించిన ఆచంట మల్లన్న!
ఈ ముఖ్యమంత్రి కి-ఇరాన్ లోను ఇజ్రాయెల్ లోను జరిగిన యుద్ధ విధ్వంసాన్ని డెమాలిషన్స్ అనకూడదు తెలియదు, ఆయన మనసులో తనను తాను హిట్లర్ అని, లేదా జనం మీద యుద్ధం చేయగల ట్రంప్ నని అనుకుంటున్నారు! ఇక, ఇరాన్, ఇజ్రాయెల్ లను ఒక వరుసలో పెట్టకూడదని తెలిసేంతగా కాంగ్రెస్ విధాన జ్ఞానం కూడా ఉండే అవకాశం లేదు!
రామ్ తో “ హడల్ ” అయిపోయాక, బయట హిందూ రిపోర్టర్ ఒకరితో రేవంత్ మాట్లాడారు! ఆశ్చర్యకరమైన మాటలున్నాయి ఆ సంభాషణలో! తెలంగాణ ఏర్పడడం ఎంతో గొప్ప విజయమని, ఐడెంటిటీ ఏర్పడడమే ఆ గెలుపు అని, వ్యక్తిగత సెంటిమెంట్ అందులో ముడిపడి ఉందని, పన్నెండేళ్లుగా అభివృద్ధి కూడా జరుగుతుందని, కొనసాగుతోందని- రేవంత్ ఆ రిపోర్టర్ తో అన్నారు! ఇటువంటి పాజిటివ్ మాటలు ఆయన నుంచి ఎప్పడూ విన్న గుర్తు లేదు! కానీ ఆయనే అవి వినిపించకుండా జనాలను హడలగొట్టారు!
హిట్లర్, హైడ్రా అన్న మాటలు రేవంత్ ఇమేజ్ ను ( అదేమన్నా మిగిలి ఉంటే) పూర్తిగా డిమాలిష్ చేసేసాయి!
Author
Srinivas Kandlakunta
(Prominent Telugu Journalist)

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

K Laxman | సేవ్ డెమోక్రసీ కాదు.. సేవ్ డైనాస్టీ మార్చ్ : కే లక్ష్మణ్
అక్టోబర్ 2, 2026

Gadwal Vijayalakshmi Cabinet Meeting | సచివాలయంలో కేబినెట్ హాల్లోకి గద్వాల విజయలక్ష్మికి నో ఎంట్రీ.. సీఎంవో అధికారుల సమాధానంతో షాక్
అక్టోబర్ 1, 2026

CM Revanth Reddy | రాజకీయాల్లోకి అలా వచ్చా.. కాంగ్రెస్‌లోకి ఇలా చేరా.. రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ



