CM Revanth Reddy | 12న ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం
CM Revanth Reddy | రాష్ట్రంలో ఎల్‌నినో( Elnino ) ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఈ నెల 12వ తేదీన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో ఎల్‌నినో( Elnino ) ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఈ నెల 12వ తేదీన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం( Rainfall ) తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు( Farmers ) ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, పెరిగిన విద్యుత్ డిమాండ్, తక్షణ అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, దాదాపు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కరువు మండలాల ప్రకటనతో పాటు తగినంత ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరింది.
వర్షాభావ ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన కార్యాచరణ, అఖిలపక్ష సమావేశం, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల సలహాలు, సూచనలపై ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో చర్చించే అవకాశముంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






