త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి (Gyan Saraswati) అమ్మ‌వారిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ద‌ర్శించుకున్నారు.

D

Telangana | Published On Apr 6, 2026, 12.42 pm IST

CM Revanth Reddy | బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy | బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి (Gyan Saraswati) అమ్మ‌వారిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ద‌ర్శించుకున్నారు. ఇవాళ ఉద‌యం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బాస‌ర చేరుకున్న సీఎంకు అధికారులు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారిని ద‌ర్శించుకుని ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా బాస‌ర‌ ఆల‌య విస్త‌ర‌ణ అభివృద్ధి ప‌నుల‌కు సీఎం భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లు కేటాయించిన విష‌యం తెలిసిందే.

బాసరలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత సీఎం ఆదిలాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. పిప్రి బ‌హిరంగ స‌భ‌లో సీఎం పాల్గొన‌నున్నారు. పిప్రిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పిప్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం రేవంత్ హాజ‌రై ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన‌నున్నారు.

Also Read..

షార్ట్ ఫిలిం తీసేందుకు వెళ్లి.. నీట మునిగి ముగ్గురు యువ‌కులు మృతి

ద‌ద్దరిల్లిన గ‌జ్వేల్‌.. భారీ బైక్ ర్యాలీతో హోరు.. బంద్ స‌క్సెస్

కార్ల‌ను కొనేవారికి గుడ్ న్యూస్‌.. భారీ డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టించిన హ్యుందాయ్..

Advertisement
Advertisement