త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Short Film | షార్ట్ ఫిలిం తీసేందుకు వెళ్లి.. నీట మునిగి ముగ్గురు యువ‌కులు మృతి

Short Film | ముగ్గురు స్నేహితులు షార్ట్ ఫిలిం (Short Film) స‌ర‌దా కాస్తా విషాదంగా మారింది. న‌దిలో మునిగి ముగ్గురు మ‌ర‌ణించారు.

G

National | Published On Apr 6, 2026, 11.59 am IST

Short Film | షార్ట్ ఫిలిం తీసేందుకు వెళ్లి.. నీట మునిగి ముగ్గురు యువ‌కులు మృతి
Advertisement

Short Film | త్రినేత్ర‌.న్యూస్‌: ముగ్గురు స్నేహితులు షార్ట్ ఫిలిం (Short Film) స‌ర‌దా కాస్తా విషాదంగా మారింది. న‌దిలో మునిగి ముగ్గురు మ‌ర‌ణించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్న‌మ‌య్య‌, చిత్తూరు, క‌డ‌ప జిల్లాల‌కు చెందిన హరిబాబు(25), హర్షవర్ధన్(22), కృష్ణచైతన్య(20) స్నేహితులు. ముగ్గురూ క‌లిసి షార్ట్ ఫిలిం తీద్దామ‌నుకున్నారు. దీంతో కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నా నది తీరానికి వెళ్లారు. చిత్రీకరణలో భాగంగా నీటిలోకి దిగిన వీరు, అక్కడ లోతైన మడుగును గమనించక ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. స‌మాచారం అందుకున్న స్థానికులు పోలీసుల‌కు విష‌యం తెలియ‌జేశారు.

దీంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రి మృత‌దేహాలు ల‌భించ‌గా, కృష్ణ చైతన్య మృతదేహం కోసం గ‌జ ఈత‌గాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యలకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement