Gajwell Bandh | దద్దరిల్లిన గజ్వేల్.. భారీ బైక్ ర్యాలీతో హోరు.. బంద్ సక్సెస్
Gajwel bandh | కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా నేడు గజ్వేల్ బంద్ (Gajwel Bandh) కొనసాగుతోంది. ఈ మేరకు బీఆర్ఎస్ (BRS) శ్రేణులు భారీ బైక్ ర్యాలీ (Bike rally) నిర్వహించారు. జై తెలంగాణ, జై జై కేసీఆర్ నినాదాలతో పట్టణమంతా దద్దరిల్లింది. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.
త్రినేత్ర.న్యూస్: కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా నేడు గజ్వేల్ బంద్ (Gajwel Bandh) కొనసాగుతోంది. ఈ మేరకు బీఆర్ఎస్ (BRS) శ్రేణులు భారీ బైక్ ర్యాలీ (Bike rally) నిర్వహించారు. జై తెలంగాణ, జై జై కేసీఆర్ నినాదాలతో పట్టణమంతా దద్దరిల్లింది. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రజలంతా బంద్ పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

రేవంత్ అండతోనే దాడులు..
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు. దాడి చేసిన కాంగ్రెస్ మూకలను గుర్తిస్తున్నామని, రెండేళ్లలో అధికారంలోకి వచ్చి ఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ వెనక కండలు తిరిగిన గూండాలున్నారని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పాలకులే ఇలా మాట్లాడితే ఇక సమాజం ఎలా తయారవుతుందో ఊహించుకోవచ్చన్నారు. రేవంత్ అండతో కాంగ్రెస్ మూకలు రెచ్చిపోయి మాట్లాడుతున్నరని మండిపడ్డారు.
కేసీఆర్‌ను తిడితే తెలంగాణను తిట్టినట్టే..
కేసీఆర్ కుటుంబాన్ని తిట్టినా తెలంగాణ ప్రజలను అన్నట్టేనని వంటేరు పేర్కొన్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని స్పష్టం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. జిల్లాల ఏర్పాటు, కలెక్టరేట్ల నిర్మాణం, పాఠశాలల ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల తవ్వకం, ఆస్పత్రుల భవన నిర్మాణాలు ఇలా ఎన్నో పనులు చేశారని గుర్తు చేశారు.
గజ్వేల్ బంద్‌తో కనువిప్పు కావాలి...
సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేక తమ ఉనికి కాపాడుకోవడానికి క్యాంపు కార్యాలయంపై దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. దాడిని మేథావులతో పాటు ప్రతిఒక్కరూ ఖండించారన్నారు. ఎవరైతే బట్టేబాజ్ పని చేస్తుండ్రో వారిని వదిలిపెట్టమని తీవ్రంగా హెచ్చరించారు. చట్టబద్ధంగా జైల్లలో పెడతామన్నారు. కేసీఆర్ పాలనలో ధర్నాలు, బంద్‌లు లేవన్నారు. ఈ కాంగ్రెస్ దౌర్భాగ్యపు పాలనలో రోడ్ల మీదే ఉండాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. గజ్వేల్ బంద్‌తో సీఎం రేవంత్‌కు, మహేశ్‌కుమార్ గౌడ్‌కు కనువిప్పు కావాలన్నారు.
గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా.. ఈరోజు గజ్వేల్ బంద్‌లో భాగంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించిన నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. pic.twitter.com/KSmqQjB1k9
— BRS Party (@BRSparty) April 6, 2026
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

MP Vaddiraju | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : ఎంపీ వద్దిరాజు
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



