త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నా మీద ప్రేమ కురిపించిన కేర‌ళీయుల‌కు ధ‌న్య‌వాదాలు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కేర‌ళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూట‌మికి ప‌ట్టం క‌ట్ట‌డంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ భారీ విజ‌యానికి కార‌ణ‌మైన యూడీఎఫ్ కూటమి నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్ హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు.

S

Telangana | Published On May 4, 2026, 4.56 pm IST

CM Revanth Reddy | నా మీద ప్రేమ కురిపించిన కేర‌ళీయుల‌కు ధ‌న్య‌వాదాలు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కేర‌ళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూట‌మికి ప‌ట్టం క‌ట్ట‌డంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ భారీ విజ‌యానికి కార‌ణ‌మైన యూడీఎఫ్ కూటమి నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్ హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు. ఈ చారిత్రాత్మ‌క విజ‌యానికి నాయ‌క‌త్వం వ‌హించిన రాహుల్ గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

కేరళం ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా నాపై హృద‌య‌పూర్వ‌క ప్రేమ‌ను కురిపించిన యూడీఎఫ్ మ‌ద్ద‌తుదారులంద‌రికీ, కేర‌ళం ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రి త‌ర‌పున కేర‌ళీయుల‌కు ఎల్ల‌ప్పుడూ కృత‌జ్ఞుడనై ఉంటాన‌ని తెలిపారు. ప్ర‌జాస్వామ్య స్ఫూర్తి ఉన్న రాష్ట్రాలుగా కేర‌ళం, తెలంగాణ ఉన్నాయి. మ‌నం అభివృద్ధిని విశ్వ‌సిస్తున్నామ‌ని చెప్పారు. ఒక ద‌శాబ్దం త‌ర్వాత కేర‌ళంలో గొప్ప భ‌విష్య‌త్‌కు సిద్ధంగా ఉన్నామ‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement