త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాన్ని కొన‌సాగిస్తున్న‌య్ : దాసోజు శ్రావ‌ణ్‌

Dasoju Sravan | కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలని, పిల్లి, ఎలుకలు అయినా కలిసి ఉంటాయోమేకాని.. ఈ రెండు పార్టీలు మాత్రం క‌ల‌వ‌వ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావ‌ణ్ కుమార్ విమ‌ర్శించారు. తెలంగాణలో రెండు పార్టీలు అక్రమ సంబంధాన్ని కొన‌సాగిస్తున్నాయ‌ని, పనిగట్టుకుని బీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలంగాణ బిడ్డ తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాల‌ని స‌వాల్ విసిరారు.

P

Telangana | Published On Jan 7, 2026, 8.09 pm IST

Dasoju Sravan | తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాన్ని కొన‌సాగిస్తున్న‌య్ : దాసోజు శ్రావ‌ణ్‌
Advertisement

Dasoju Sravan | కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలని, పిల్లి, ఎలుకలు అయినా కలిసి ఉంటాయోమేకాని.. ఈ రెండు పార్టీలు మాత్రం క‌ల‌వ‌వ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావ‌ణ్ కుమార్ విమ‌ర్శించారు. తెలంగాణలో రెండు పార్టీలు అక్రమ సంబంధాన్ని కొన‌సాగిస్తున్నాయ‌ని, పనిగట్టుకుని బీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలంగాణ బిడ్డ తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాల‌ని స‌వాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాసే విధంగా వెదిరే శ్రీరామ్ మాట్లాడుతున్నార‌ని, కేసీఆర్‌పై వెదిరే శ్రీరామ్ అసత్య ప్రచారం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆంధ్రా ఆదిత్యనాథా దాస్ ఏపీకి అనుకూలంగా మాట్లాడుతున్నార‌ని, ఇరిగేషన్‌పై అవగాహన ఉన్న వెదిరె శ్రీరామ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేద‌ని నిల‌దీశారు. తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నార‌ని, ఒక్క అంశంపైన అయినా కాంగ్రెస్‌ను బీజేపీ నేతలు నిలదీశారా? అంటూ ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ నేత‌ల్లా బీజేపీ నేత‌ల వ్య‌వ‌హారం..

బీజేపీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నేతలుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నార‌ని, రేవంత్ రెడ్డి మరో హిమంత బిశ్వ శర్మ అవుతారని బీజేపీ అనుకుంటుంద‌న్నారు. వెదిరె శ్రీరామ్ కు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఏం పని అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్‌లో వెదిరె శ్రీరామ్‌కు ఏం పని ఆయ‌న ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెదిరె శ్రీరామ్ ముగ్గురు కలిసి కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నార‌ని ఆరోపించారు. ముగ్గురి మాట‌ల్లో తేడా లేద‌ని, ఉమ్మడి రాష్ట్రంలో ఎవరి ప్రయోజనం కోసం తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించార‌న్నారు. వెదిరె శ్రీరామ్‌కు ఈ విషయం తెలియదా? అని మండిప‌డ్డారు.
రేవంత్ రెడ్డికి శ్రీరామ్ కొమ్ము కాస్తూ ఆరోపణలు చేస్తున్నార‌ని, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపు వెనుక ఉమ్మడి ఏపీ, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగింద‌న్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక 28 లేఖలు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ జలాలపై రాశార‌ని, చంద్రబాబును మెప్పించడం కోసం బీజేపీ పని చేస్తోంద‌న్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఎందుకు రావడం లేద‌న్నారు. కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నీటి హక్కుల కోసం ఎందుకు మాట్లాడటం లేద‌ని నిల‌దీశారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి అయ్యాయ‌ని.. రేవంత్ రెడ్డిని మెప్పించడం కోసం తెలంగాణ బీజేపీ శాఖకు తాళం వేసుకోండి అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణకు చేసిన ప్రయోజనాన్ని చిన్నగా చూపే ప్రయత్నం చేస్తున్నార‌ని ఆరోపించారు.

రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఆపాల‌ని మాట్లాడిందే బీఆర్ఎస్..

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని 2020లోనే బీఆర్ఎస్ మాట్లాడింద‌ని.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లిన‌ట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి, వెదిరె శ్రీరామ్‌, కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందరూ మోదీ వద్దకు వెళ్లి కృష్ణా జలాలు 70 శాతం తీసురావాల‌న్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు కేసీఆర్ హాజ‌ర‌య్యార‌ని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై 18 లేఖలు కేసీఆర్ కేంద్రానికి రాశార‌ని గుర్తు చేశారు. అధికారం పోయి రెండు ఏళ్ళు అయినా కేసీఆర్ పైన ఏడుస్తున్నార‌ని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో వెదిరే శ్రీరామ్ అడగాల‌న్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో కాంట్రాక్టర్ల కుమ్మక్కుపై వెదిరే శ్రీరామ్ మాట్లాడాల‌ని స‌వాల్ విసిరారు.

కాంగ్రెస్, బీజేపీ రాజకీయ‌ వ్యభిచారం చేస్తున్నాయి..

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజ‌కీయ వ్యభిచారం చేస్తున్నాయ‌ని దాసోజు విమ‌ర్శించారు. మోదీ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి మాట మాట్లాడుతున్నార‌ని, తెలంగాణలో బీజేపీ ముసుగులో ఉన్న కాంగ్రెస్ నేతలు ఉన్నార‌ని, కేసీఆర్ పై ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నార‌న్నారు. మోదీ, రేవంత్ రెడ్డి బడే భాయ్.. చోటా భాయ్ లా పని చేస్తున్నార‌న్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచారని, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సిగ్గు పడాల‌న్నారు. రూ.200 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు రేవంత్ రెడ్డి రిపేర్ చేయడం లేద‌ని, ప్రాజెక్టుపై, మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ పై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ బీజేపీని ఏమైనా కాంగ్రెస్ పార్టీకి రాసి ఇచ్చారా? అంటూ మండిప‌డ్డారు.

మ‌న‌సెందుకు రావ‌డం లేదు..

బీజేపీ నేతలకు తెలంగాణలో కాంగ్రెస్ దుర్మార్గాలపై మాట్లాడే మనసు ఎందుకు రావడం లేద‌ని, కాంగ్రెస్ తానా అంటే బీజేపీ నేతలు తందానా అంటున్నార‌ని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాన్ని ప్రజలకు వివరిస్తామ‌ని.. మోదీ ఆర్ఆర్ ట్యాక్స్ అన్నార‌ని, తెలంగాణ బీజేపీ నేతలు ఎవరైనా ఆర్ ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడారా? అంటూ ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డిపై ఎందుకు బీజేపీ మాట్లాడటం లేద‌ని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కలేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సరెండర్ అయ్యింద‌న్న దాసోజు శ్రవణ్.. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ని డ్యామేజ్ చేయడం కోసం చాలా మందితో మాట్లాడిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆ మాటలు ఎవరికి ఉపయోగపడుతున్నాయో ఆలోచించాల‌ని, రేవంత్ రెడ్డికి మేలు చేసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. అంబేద్క‌ర్ విగ్రహం, అమరవీరుల స్థూపంలో అవినీతి జరిగితే విచారణ చేయమని చెప్పాల‌న్నారు. అంబేద్క‌ర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి అవ‌మానిస్తున్నార‌ని, అమరవీరుల స్థూపాన్ని ఎందుకు ఓపెన్ చేయడం లేద‌ని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్‌పై ఎవరు మాట్లాడినా ఆత్మ విమర్శ చేసుకోవాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు.

Advertisement

తాజావార్తలు

Advertisement