త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మ‌హిళ‌ల‌ను చూస్తుంటే పాల‌పిట్ట‌లను చూసిన‌ట్టు ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కాంగ్రెస్ పార్టీ ఏ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించినా.. ఆ స‌భ‌కు హాజ‌ర‌య్యే మ‌హిళ‌లంద‌రూ రేవంత్ స‌ర్కార్ పంపిణీ చేసిన చీర‌ల్లోనే ద‌ర్శ‌న‌మిస్తున్నారు. ఆ చీర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చిన మ‌హిళ‌ల‌ను చూసి సీఎం రేవంత్.. మ‌హిళ‌ల‌ను చూస్తుంటే పాల‌పిట్ట‌ల‌ను చూసిన‌ట్టు ఉంద‌ని ఆయ‌న అన్నారు.

S

Telangana | Published On Feb 5, 2026, 7.43 pm IST

CM Revanth Reddy | మ‌హిళ‌ల‌ను చూస్తుంటే పాల‌పిట్ట‌లను చూసిన‌ట్టు ఉంది : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ ఏ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించినా.. ఆ స‌భ‌కు హాజ‌ర‌య్యే మ‌హిళ‌లంద‌రూ రేవంత్ స‌ర్కార్ పంపిణీ చేసిన చీర‌ల్లోనే ద‌ర్శ‌న‌మిస్తున్నారు. ఆ చీర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చిన మ‌హిళ‌ల‌ను చూసి సీఎం రేవంత్.. మ‌హిళ‌ల‌ను చూస్తుంటే పాల‌పిట్ట‌ల‌ను చూసిన‌ట్టు ఉంద‌ని ఆయ‌న అన్నారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా చొప్ప‌దండిలో “ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

మ‌హిళ‌ల‌ను చూస్తుంటే పాల‌పిట్ట‌ల‌ను చూసిన‌ట్టు ఉంది. ఇంటి ఆయ‌న కూడా సంతోష‌ప‌డుతాడు. అక్క‌లంద‌రూ పాల‌పిట్ట చీర‌లు క‌ట్టుకుని త‌మ్ముడిని ఆశీర్వ‌దించేందుకు వ‌చ్చారు. బ‌తుక‌మ్మ చీర‌లు ఎన్న‌డైనా క‌ట్టుకున్నారా..? సూర‌త్ నుంచి కిలోల కొద్ది చీర‌లు కొనుక్కొచ్చి కోట్ల రూపాయాలు క‌మిష‌న్లు తీసుకున్నారు బీఆర్ఎస్ నేత‌లు. ఆ చీర‌ల‌ను పిట్ట‌ల‌ను బెదిరించేందుకు పొలాల వ‌ద్ద క‌ట్టారు. ఇవాళ ఇందిర‌మ్మ చీర‌ల‌తో మ‌హిళ‌లు సంతోషంగా ఉన్నారు. మొన్న స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌కు ల‌క్ష‌లాది మంది మ‌హిళ‌లు ఉచిత బ‌స్సులో ప్ర‌యాణించారు. రెండేండ్ల‌లో ఉచిత బ‌స్సు ప్ర‌యాణానికి రూ. 9 వేల కోట్లు లెక్క‌క‌ట్టి ఇచ్చాం. వెయ్యి బ‌స్సుల‌కు య‌జ‌మానులు అయ్యారు. జిల్లా కేంద్రాల్లో పెట్రోల్ బంకులివ్వ‌డంతో వ్యాపారం చేస్తున్నారు. సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్నారు. శిల్పారామం చుట్టూ వంద‌ల కోట్ల భూమి ఇచ్చి 150 స్టాల్స్ పెట్టి మ‌హిళ‌లు త‌యారు చేసిన వ‌స్తువుల‌ను ప్ర‌పంచానికి అమ్మేలా అవ‌కాశం క‌ల్పించాం. ఆడ‌బిడ్డ‌ల ఆత్మ‌గౌర‌వం పెంచేందుకు య‌త్నిస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement