త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | అభివృద్ధి కోసం క‌లిసి ప‌ని చేస్తున్నాం

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రాభివృద్ధి కోసం ఒక‌రికొక‌రం క‌లిసి ప‌ని చేస్తున్నామ‌ని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌ప్పుడే త‌మ‌కు రాజ‌కీయాలు అని మిగ‌తా స‌మ‌యంలో ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణితో ముందుకు పోతున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Sep 30, 2026, 5.20 pm IST

CM Revanth Reddy | అభివృద్ధి కోసం క‌లిసి ప‌ని చేస్తున్నాం
Advertisement

ఎన్నిక‌ల‌ప్పుడే రాజ‌కీయాలు
మిగ‌తా స‌మ‌యంలో ఇచ్చిపుచ్చుకుంటాం
స‌హ‌క‌రించిన వారికి కృత‌జ్ఞ‌త చెబుతాం
నా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై అరాజ్ పాట ప‌డుతున్నారు
క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వంలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రాభివృద్ధి కోసం ఒక‌రికొక‌రం క‌లిసి ప‌ని చేస్తున్నామ‌ని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌ప్పుడే త‌మ‌కు రాజ‌కీయాలు అని మిగ‌తా స‌మ‌యంలో ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణితో ముందుకు పోతున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి స‌హ‌క‌రిస్తున్న కేంద్రానికి కృత‌జ్ఞ‌త చెప్ప‌డం మ‌న బాధ్య‌త అని పేర్కొన్నారు. కానీ కొంద‌రు త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌పై అరాజ్ పాట ప‌డుతున్నార‌ని సీఎం రేవంత్ మండిప‌డ్డారు. క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్సవం అనంత‌రం ఉద్యోగుల‌ను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.

ఈ కార్యాల‌యం పేద‌వాడికి న‌మ్మ‌కం, విశ్వాం క‌లిగించాలి. స‌మ‌స్య‌ల చిక్కుముడుల‌ను విప్ప‌డానికి ఈ కార్యాల‌యం సంపూర్ణంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని విశ్వ‌సిస్తున్నా. రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రం స‌హ‌కారంతో చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు, చేస్తున్న అభివృద్ధి పేద‌ల‌కు చేరాలి. అత్యంత నిరుపేద‌ల‌కు చేరాలి అంటే ప్ర‌భుత్వ ఉద్యోగులు ప్ర‌భుత్వం యొక్క ప్ర‌తినిధులుగా ప‌ని చేయాలి. త‌మ ప్ర‌తినిధులుగా సేవ‌లందిస్తున్న మీకు మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిది. అందుకే ఇవాళ చాలా కాలంగా వాయిదాప‌డుతున్న క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చినం. సేవ‌లు అందించ‌బోతున్నాం. ఎవ‌రు వ‌చ్చినా.. క‌లెక్ట‌ర్, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్, ఉద్యోగుల‌కు సూచ‌న ఒక్క‌టే.. బాధ‌తో, స‌మ‌స్య‌ల‌తో స‌హాయం కోసం నిస్స‌హాయంగా నిల‌బ‌డ్డ వాళ్ల‌ను మీ కుటుంబ స‌భ్యుల్లాగా చూడండి. అప్పుడే మీ స‌హాయం కోసం ఇక్క‌డికి వ‌చ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జ‌రుగుతుంద‌ని భావిస్తున్నాను అని సీఎం తెలిపారు.

ఇంకా స‌మ‌స్య‌లు ఉన్న‌య్..

ప్ర‌జా పాల‌న ఏర్ప‌డ్డ రోజు ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్తుల‌కు ఒక‌టో తేదీన జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి. ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటూ, మీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ జీత‌భ‌త్యాలు, పీఆర్సీ, ప‌ద‌వీవిర‌మ‌ణ బెనిఫిట్స్, బ‌దిలీలు, ప‌దోన్న‌తులు.. ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తున్నాం. మీరు తోడ్పాటు అందించ‌నుంద‌కు మీ స‌మ‌స్క‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు పోతున్నాం. మొత్తం స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయిన‌వి అని నేను చెప్ప‌ను. ఇంకా స‌మ‌స్య‌లు ఉన్న‌య్.. ప్ర‌జల‌కు సేవ‌లందించుకుంటూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుందాం. అప్పుడే ప్ర‌జ‌ల ప‌ట్ల మ‌న‌కున్న అంకిత‌భావం, విశ్వాసం బ‌ల‌ప‌డుతుంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అభినందించ‌డానికి సీఎంగా నాకు శ‌ష‌భిష‌లు లేవు

రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు ప‌దిన్న‌ర ల‌క్ష‌ల ఉద్యోగులు ఉన్నారు. వీరు నాలుగు కోట్ల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్నారు. 3 శాతం ఉద్యోగస్తులు 97 శాతం మంది ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్నారు. ఇది శ్ర‌మ‌తో కూడుకున్న ప‌ని. మీరంతా క‌ష్ట‌ప‌డితేనే ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంది. సీఎంకు కావొచ్చు, ప్ర‌ధానికి కావొచ్చు.. మంచి, చెడ్డ పేరు వ‌చ్చేది మీ వ‌ల్ల‌నే. మీరు బాగా ప‌ని చేస్తేనే.. మాకు మంచి పేరు వ‌స్త‌ది. మీరు స‌హాయ నిరాక‌ర‌ణ చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌ట్ల‌ నిర్ల‌క్ష్యం వ‌హిస్తే కేంద్ర రాష్ట్రాలు ప‌ని చేయ‌ట్లేద‌ని అంట‌రు. ఎన్ని అనుమ‌తులు, నిధులు ఇచ్చినా ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల్సింది మీరు. సేవ‌లందించేందుకు మీకు మౌలిక వ‌స‌తులు ఉండాల‌ని కలెక్ట‌రేట్‌ను ప్రారంభించుకన్నాం. కేంద్రం నుంచి అర్బ‌న్ చాలెంజ్ ఫండ్స్ కింద రూ. 840 కోట్లు నిధులు తెచ్చుకున్నాం. కేంద్రం స‌హ‌క‌రిస్తే అభినందించ‌డానికి సీఎంగా నాకు శ‌ష‌భిష‌లు లేవు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడే మాకు రాజ‌కీయాలు.. ప్ర‌త్య‌ర్థులం. మిగ‌తా స‌మ‌యంలో ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణితో ముందుకు పోతాం. కేంద్ర రాష్ట్ర సంబంధాల‌ను మెరుగుప‌రుచుకునేందుకు నిరంత‌రం ప్ర‌య‌త్నం చేస్తున్నాం. కేంద్ర మంత్రుల‌ను క‌లిసి స‌మ‌స్య‌ల‌ను దృష్టికి తీసుకుపోతున్నాం. అనుమ‌తులు, నిధులు ఇవ్వాల‌ని కోరుతున్నాం. వంద‌ల కోట్ల ప్రాజెక్టులు నిర్మించుకున్న‌ప్ప‌టికీ అనుతుములు ఇవ్వ‌క‌పోతే నిష్ఫ‌లం అవుతుంది. కేంద్రం వ‌ద్ద‌కు వెళ్తే అరాజ్ పాట పాడుతున్నారు కొంద‌రు. ఎన్నిసార్లైనా వెళ్లాల్సిందే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాలంటే అని సీఎం పేర్కొన్నారు.

నేను ఆరు నెల‌ల్లోనే అనుమ‌తి తీసుకువ‌చ్చాను

ప‌ని చేసేటోన్ని అంట‌రు.. ప‌ని చేయ‌నోన్ని అన‌రు. మీ క‌రీంన‌గ‌ర్ రావాలంటే శామీర్‌పేట నుంచి కంటోన్మెంట్ దాటేందుకు స‌మ‌యం ప‌డుతుంది. న‌ర‌కం అనుభ‌వించిన‌ట్టు ఉండేది. చంద్ర‌బాబు వాజ‌పేయి వ‌ద్ద ప్ర‌య‌త్నం చేసిండు. 2004 నుంచి 2014 వ‌ర‌కు వైఎస్సార్ మ‌న్మోహ‌ప‌న్ సింగ్ వ‌ద్ద ప్ర‌య‌త్నం చేసిండు, 2014 నుంచి 2023 వ‌ర‌కు బీఆర్ఎస్ కేంద్రంలో ప్ర‌య‌త్నం చేసింది.. కానీ ప‌రిష్కారం కాలేదు. కానీ నేను ఆరు నెల‌ల్లోనే 170 ఎక‌రాల్లో కంటోన్మెంట్ రోడ్డులో అనుమ‌తి తీసుకువ‌చ్చాను. బేగంపేట ర‌న్‌వే కింద టన్నెల్‌కు అనుమ‌తిచ్చారు. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇలా ఇవ్వ‌లేదు. ఏవియేష‌న్ మంత్రి, ర‌క్ష‌ణ మంత్రి, ప్ర‌ధాని స‌హ‌క‌రించారు. మీ ప్రాంత అభివృద్ధి కోసం ఎలివేటెడ్ కారిడార్ క‌ట్టుకుంటున్నాం. ఏడాదిలోపు అందుబాటులోకి రాబోతుంది. రూ. 5 వేల కోట్ల‌తో రోడ్ల‌ను నిర్మించుకుంటున్నాం. ఇలాంట‌ప్పుడు స‌హ‌క‌రించిన వారికి కృత‌జ్ఞ‌త తెల‌ప‌డం మ‌న బాధ్య‌త‌. బండి సంజ‌య్, నేను విద్యార్థి రాజ‌కీయాల నుంచి రాజ‌కీయ కార్య‌క‌ర్త‌లుగా వివిధ హోదాల్లో దేశ రాజ‌కీయాల వ‌ర‌కు అవ‌కాశం వ‌చ్చిందంటే ప్ర‌జ‌లు ఎంతో న‌మ్మ‌కం పెట్టుకుని ఈ బాధ్య‌త ఇచ్చారు. అభివృద్ధిలో ఒక‌రికొక‌రం క‌లిసి ప‌ని చేస్తున్నాం. సిద్ధాంత‌ప‌రంగా మా ఉద్దేశాలు వేరు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement