త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | గ‌జ్వేల్‌లోనే నిన్ను స‌మాధి చేసే బాధ్య‌త నాది : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గ‌జ్వేల్‌లోనే నిన్ను స‌మాధి చేసే బాధ్య‌త నాది, యువ‌కుల‌ది అని కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

S

Telangana | Published On Jul 18, 2026, 7.52 pm IST

CM Revanth Reddy | గ‌జ్వేల్‌లోనే నిన్ను స‌మాధి చేసే బాధ్య‌త నాది : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గ‌జ్వేల్‌లోనే నిన్ను స‌మాధి చేసే బాధ్య‌త నాది, యువ‌కుల‌ది అని కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందెశ్రీ స్మృతివ‌నానికి భూమిపూజ చేసిన సంద‌ర్భంగా సీఎం ఈ వ్యాఖ్య‌లు చేశారు.

నన్ను తిట్టినంత మాత్రానా.. నీ క‌డుపులో ఉన్న విషాన్ని వెద‌జ‌ల్లినంత మాత్రానా.. ఈ తెలంగాణ స‌మాజం నిన్ను క్ష‌మించ‌దు. నిజాముల పైజామాలు ఊడ‌గొడుతాం దిగంతాల‌కు త‌రిమికొడుతాం అని ఓ క‌వి చెప్పిన వ్యాఖ్య‌ల‌ను స్ఫూర్తిగా తీసుకుని ప‌ని చేస్తున్నాం. తెలంగాణ స‌మాజం అన్ని ఇచ్చింది మీకు.. ఆస్తులు, అంతస్తులు, ఆగ‌ర్భ‌శ్రీమంతుల‌ను చేసింది.. ఏం త‌క్కువ చేసింది తెలంగాణ మీకు. తిరిగి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మీరు ఏం ఇచ్చార‌ని స‌మాజం అడుగుతుంది. ఏం అన్యాయం చేసింది మీకు. చెప్పులు లేకుండా తిరిగినోళ్ల‌కు, గంజికి గ‌తిలేనోళ్ల‌కు బెంజ్ కార్లు వ‌చ్చాయి. దుబాయ్ పాస్‌పోర్ట్ బ్రోక‌ర్ సీఎం అయ్యాడు క‌దా.. ఏం త‌క్కువ చేసింది ఈ తెలంగాణ మీకు. పాస్ పోర్ట్ బ్రోక్ సీఎం అవుతాడ‌ని క‌ల‌లు క‌న్నారా మీరు. అమెరికాలో బాత్రూమ్‌లో క‌డుక్కునే నిన్ను ఐటీ మినిస్ట‌ర్‌గా చేశారు. బ‌తుక‌మ్మ పండుగ‌ల‌ప్పుడు వ‌సూళ్లు చేసే మీ చెల్లెను కూడా ఎమ్మెల్సీ, ఎంపీ చేశారు. మీకు అంత ఐశ్వ‌ర్యం, అంత‌స్తుల‌ను ఇచ్చిన తెలంగాణ స‌మాజానికి మీరు చేసిన ద్రోహం మ‌రిచిపోరు. నేను ఉన్నంత వ‌ర‌కు నీ కుటుంబాన్ని మొలకెత్త‌నివ్వ‌ను అని సీఎం తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement