CM Revanth Reddy | రాహుల్ గాంధీకి రూ. వెయ్యి కోట్లు ఇచ్చే శక్తి తెలంగాణకు ఉంది : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | సొంతిల్లు లేని రాహుల్ గాంధీకి రూ. వెయ్యి కోట్లు ఇచ్చే శక్తి తెలంగాణకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వారికి ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా..? అని సీఎం నిలదీశారు.
సొంతిల్లు లేని రాహుల్‌కు డబ్బులు అవసరమా..?
అవినీతి ఆరోపణలతో గాంధీ కుటుంబాన్ని అవమానిస్తున్నారు..
గాంధీ కుటుంబం ఉన్నంతకాలం ఈ దేశం ఐక్యంగా ఉంటుంది..
డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : సొంతిల్లు లేని రాహుల్ గాంధీకి రూ. వెయ్యి కోట్లు ఇచ్చే శక్తి తెలంగాణకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాలోని హరిత వ్యాలీ రిసార్ట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న పది రోజుల ప్రత్యేక శిక్షణా శిబిరం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి గతమే కాదు భవిష్యత్ కూడా ఉన్నది. దేశానికి సంబంధించిన భవిష్యత్ కూడా ఉన్నది. ఈ దేశాన్ని, కాంగ్రెస్ పార్టీని విడదీసి చూడలేం. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని దెబ్బతీయాలని భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అది అంత ఆషామాషీ విషయం కాదు. రాహుల్ గాంధీని పార్లమెంట్‌లో మాట్లాడనివ్వకపోయినా.. గాంధీ కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడినా.. అవినీతి ఆరోపణలతో గాంధీ కుటుంబాన్ని అవమానించాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది అని సీఎం తెలిపారు.
తలా ఓ చేయి వేస్తే తెలంగాణ నుంచి ఓ వెయ్యి కోట్లు
ఉండడానికి ఇల్లు లేక దేశం కోసం మూడు తరాలు ప్రాణాలర్పించి గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కనా..? నిజంగానే వారికి డబ్బులు కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ పది వేల కోట్ల రూపాయాలు జమ అవుతాయి గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. గాంధీ కుటుంబానికి ఒక వేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయంటే.. తలా ఓ చేయి వేస్తే తెలంగాణ నుంచి ఓ వెయ్యి కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంది. రాహుల్ గాంధీ ఉండడానికి సొంతిల్లు లేదు. పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినప్పుడు, ఇల్లు ఖాళీ చేయించినప్పుడు ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు. చివరకు తన తల్లి సోనియా ఉండే 10 జన్‌పథ్ వెళ్లి నివాసం ఉన్నారు. ఇల్లే లేని రాహుల్ గాంధీకి డబ్బులు అవసరమా..? దేశం కోసం మూడు తరాలు ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరం ఉన్నాయా..? ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వారికి ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా..? అయినా ఆ కుటుంబాన్ని అవమానించాలని, రాజకీయంగా అడ్డు తొలగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
పేదల గొంతును నొక్కేయాలని కుట్ర
గాంధీ కుటుంబం రాజకీయాల్లో ఉన్నంత కాలం ఈ దేశం ఐక్యంగా ఉంటుంది.. ఈ దేశంలోని దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలకు గొంతుకై గాంధీ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి ఆ పేదల గొంతును నొక్కేయాలని కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలను అర్థం చేసుకుని తిప్పికొట్టాల్సిన బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీ మీద బాధ్యత ఉన్నది అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



