Jeevan Redy | ఇక రేవంత్ అర్ధాయుష్షే మిగిలింది
Jeevan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ కాలపరిమితి సగం ముగిసిపోయిందని.. రేవంత్‌రెడ్డి అర్ధ ఆయుష్షు మాత్రమే మిగిలిందని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకే జీవో 9 తెచ్చారని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి చెడగొడుతున్నాడని ఆరోపించారు.
- ప్రభుత్వ కాలపరిమితి సగం అయిపోయింది
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చేందుకే జీవో 9
- యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో టైం పాస్ చేస్తున్నారు
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విమర్శలు
Jeevan Redy | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వ కాలపరిమితి సగం ముగిసిపోయిందని.. రేవంత్‌రెడ్డి అర్ధ ఆయుష్షు మాత్రమే మిగిలిందని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకే జీవో 9 తెచ్చారని మండిపడ్డారు. తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని దుయ్యబట్టారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
ఒక్క గురుకుల పాఠశాల కట్టలే..
ప్రభుత్వ అనుమతితో కళాశాల నిర్మిస్తారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కళాశాలలను ప్రభుత్వం ఒప్పించుకోలేకపోతే ఎలా? 30 నెలల నుంచి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మూడో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నా ఒక్క గురుకుల పాఠశాల నిర్మించలేదు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడైతే BC రెసిడెన్షిల్ స్కూల్స్ ఉన్నాయో వాటినే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అని అంటున్నారు అని విమర్శించారు.
విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో విద్యార్థులు తెలంగాణ వచ్చేందుకు బాటలు వేశారు. రెండు పర్యాయాలు కేసీఆర్ విద్యా అవకాశాలు మెరుగుపరిచారు. రాజశేఖర్ రెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడంలో విఫలమయ్యారు. విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రూ. 10 వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. అడ్మిషన్ ప్రక్రియలో విద్యార్థులు ఫీజు చెల్లించలేకపోతున్నారు. విద్యార్థులు తక్షణమే కళాశాలలో ఫీజు చెల్లించాలని అంటున్నారు. విద్యను మెరుగు పరుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. విద్యను మెరుగుపరచడం దేవుడెరుగు, విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి చెడగొడుతున్నాడు అని జీవన్‌రెడ్డి ఆరోపించారు.
6 రూపాలు కూడా ఖర్సు వెట్టలే..
మన ఊరు మన బడిలో భాగంగా నిర్మించిన స్కూల్ ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల. ఆరుట్ల ప్రభుత్వ స్కూల్‌కు రంగులు పూసి గొప్పలు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ఒక్కో రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో పబ్బం గడుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 30 నెలల పాలనలో 30 వేల ఉద్యోగాలు కల్పించలేదు. ఆంగ్ల బోధనను మెరుగుపర్చడంలో ఈ ప్రభుత్వం విఫలం. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి వైఖరి ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చే విధంగా జీవో 9 తెచ్చారు. గతంలో విద్యార్థులపై ఆర్థిక భారం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగింది. రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ పేరును చులకన చేస్తున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బడ్జెట్‌లో 6 వేల కోట్ల రూపాయలు పొందుపరిచి, 6 రూపాయలు ఖర్చు చేయలేదు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పి. శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ - సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..
- ●Monsoon | రుతుపవనాల జాడేది?
- ●NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్ఎస్ఈ సీఈఓ కీలక సూచనలు..
- ●Shruthi Haasan | తండ్రి సినిమాలో యాక్టర్‌గా ఛాన్స్ - రిజెక్ట్ చేసిన శృతి హాసన్
- ●Chamala Kirankumar Reddy | అయోధ్య ట్రస్ట్‌తో రూ.200 కోట్లు మింగిర్రు
- ●Ecuador | 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్ నాకౌట్‌కు.. నేషనల్ హాలీడే ప్రకటించిన అధ్యక్షుడు డేనియల్ నొబోవా

Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ - సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..

Monsoon | రుతుపవనాల జాడేది?

NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్ఎస్ఈ సీఈఓ కీలక సూచనలు..

Shruthi Haasan | తండ్రి సినిమాలో యాక్టర్‌గా ఛాన్స్ - రిజెక్ట్ చేసిన శృతి హాసన్





