Small Plane Crash | 109 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో
Small Plane Crash | త్రినేత్ర.న్యూస్: చైనా రాజధాని బీజింగ్‌లో (Beijing) పెను ప్రమాదం తప్పింది. నగరంలోని 109 అంతస్తుల భవనాన్ని ఓ చిన్న విమానం (Small Plane Crash) ఢీకొట్టింది. దీంతో భవనం పైభాగం దెబ్బతిన్నది.
International | Published On Jun 27, 2026, 9.30 am IST
Small Plane Crash | త్రినేత్ర.న్యూస్: చైనా రాజధాని బీజింగ్‌లో (Beijing) పెను ప్రమాదం తప్పింది. నగరంలోని 109 అంతస్తుల భవనాన్ని ఓ చిన్న విమానం (Small Plane Crash) ఢీకొట్టింది. దీంతో భవనం పైభాగం దెబ్బతిన్నది. గాజు ముక్కలు, విమాన శకాలు కింద రోడ్డుపై పడటంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బీజింగ్‌లోని అత్యంత ఎత్తయిన సిటిక్ టవర్ (CITIC Tower), చైనా జున్ (China Zun) అని పిలిచే 109 అంతస్తుల భవనాన్ని రెండు సీట్లతో కూడిన తేలికపాటి సన్‌వార్డ్ ఎస్ఏ60ఎల్ అరోరా (Sunward SA60L Aurora-B-12PP) విమానం ఢీకొట్టింది. దీంతో భవనానం స్వల్పంగా ధ్వంసమవగా, విమానం ముక్కలుముక్కలు అయింది. దాని శకలాలు కిందపడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశాయి. భవనంలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు.
విమానంలో పైలట్ ఒక్కరే ఉన్నారని అధికారులు తెలిపారు. శిఫోసీ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన 30 నిమిషాల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటి? పైలట్ పరిస్థితి ఎలా ఉంది? ఎవరైనా ప్రాణనష్టం లేదా గాయాలు జరిగాయా? అనే అంశాలపై చైనా అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రమాదానికి గురైన విమానం మోడల్ దేశంలో అత్యత విజయవంతం అయింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తారు.
BREAKING: China’s domestically produced light general aviation small aircraft, model B-12PP, has CRASHED into Beijing's tallest building! pic.twitter.com/8NGt9cVhCN
— Griha Atul (@GrihaAtul) June 26, 2026
JUST NOW: An aircraft has crashed into Beijing’s tallest skyscraper, the 109-story CITIC Tower (China Zun), in China. pic.twitter.com/40YFaQUnK3
— WORLD NEWS (@_MAGA_NEWS_) June 26, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cape Verde Vs Saudi Arabia | కేప్ వెర్డే చరిత్ర..
- ●France Vs Norway | ఉస్మాన్ డెంబెలే హ్యాట్రిక్
- ●Pulse Polio | 28న పల్స్ పోలియో.. నాలుగు రోజులపాటు పోలియో చుక్కలు..
- ●Senegal Vs Iraq | సెనెగల్ అద్భుతం
- ●Venezuela | వెనిజులాలో మరోసారి భూకంపం.. 900 దాటిన మృతులు
- ●Revanth Reddy | మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు.. భూములిచ్చేవారికి టీడీఆర్: సీఎం రేవంత్ రెడ్డి










