Devi Prasad | మూడేండ్లు బీటెక్ చదివితే స్థానికులు ఎట్లయితరు?
Devi Prasad | తెలంగాణలో మరోసారి ముల్కీ ఉద్యమం వచ్చే అవకాశం కనిపిస్తుందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో మూడేండ్లు బీటెక్ చదివితే స్థానికులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పల్లా నిషాంత్ కేసులో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు.
- మరో ముల్కీ ఉద్యమం తప్పదేమో
- తెలంగాణ రిజర్వేషన్లు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
- నిన్నటి సభలో రేవంత్ పిఆర్సీ ఊసే ఎత్తలేదు
- పైగా అన్నా అని పిలవమని చెప్తున్నడు
- మీడియా సమావేశంలో రేవంత్‌పై దేవీప్రసాద్ సెటైర్లు
Devi Prasad | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో మరోసారి ముల్కీ ఉద్యమం వచ్చే అవకాశం కనిపిస్తుందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో మూడేండ్లు బీటెక్ చదివితే స్థానికులు ఎలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతానికి చెందినవారు ఇతర రాష్ట్రాల్లో చదివితే స్థానికులుగా గుర్తించడం లేదన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పల్లా నిషాంత్ కేసులో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ తీర్పు ఇచ్చిన జడ్జిని మేం తప్పుపట్టడం లేదని.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన వాదనలు వినిపించడంలో విఫలం అయిందని మండిపడ్డారు.
ఉద్యోగ సంఘాలతో రేవంత్ రెడ్డి బహిరంగ సభ పెట్టారు. బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి బీమా పథక సదుపాయం ఇప్పటికే ఉంది. నిన్నటి సభలో PRC గురించి చర్చనే లేదు. 6 DAలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకటో రెండో DAలు ఇస్తారని ఉద్యోగులు ఎదురుచూశారు. CPS రద్దు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడనే లేదు. ఈ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుంది. నెలకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామనే కారణంతో ఉద్యోగుల మిగతా డిమాండ్లేవి సీఎం పట్టించుకోవడం లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చాలా శాఖల్లో నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. భూ భారతిలో కూడా ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వడం లేదు అని దేవీప్రసాద్ విమర్శించారు.
తనను అన్న అని పిలవాలని రేవంత్ అంటున్నారు. కేవలం అన్న అని పిలిపించుకుంటే సరిపోదు. ఉద్యోగుల అన్ని డిమాండ్లు నెరవేరిస్తే ఏమైనా పిలుస్తారు. నిన్నటి రేవంత్ రెడ్డి సభ స్పీచ్ పై ఉద్యోగాలు ఎంతో ఆశతో ఎదురుచూశారు. సంపద పెంచుకోండి.. మీరే ఎంతయినా తీసుకోండి అని ఉద్యోగులకు రేవంత్ సలహా ఇస్తున్నాడు. ప్రజలపై పన్నుభారం వేసి ఉద్యోగులు సంపద పెంచుకోండి అంటే ఎలా? అని ప్రశ్నించారు.
మూడేండ్లు తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ (B tech) చదివితే స్థానికులు ఎలా అవుతారు. తెలంగాణలో బీటెక్ (B tech) పూర్తి చేసిన ఇతర రాష్ట్రాల వారు మొత్తం స్థానికులుగానే భావించాల్సి వస్తుంది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పల్లా నిషాంత్ కేసులో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుంది. సాంకేతిక సమస్యల కోర్టు తీర్పుతో తెలంగాణకు అనేకసార్లు తీవ్ర అన్యాయం జరిగింది. ఆదిలాబాద్ కొమురం భీం జిల్లా లాంటి ప్రాంతాల వారు ఉద్యోగాలు పొందలేక పోయారు. ఈ అంశాలను గమనించి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా కేసీఆర్ కృషి చేశారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదువుకున్న వారిని స్థానికులుగా గుర్తించాలని కేసీఆర్ హయాంలో నిర్ణయం తీసుకున్నారు అని ఆయన గుర్తు చేశారు.
స్థానిక అంశం వల్ల తెలంగాణలో మళ్లీ అలజడులు జరిగేలా ఉన్నాయి. ఈ అంశంపై సీరియస్‌గా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రిజర్వేషన్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన రీతిలో కౌంటర్ దాఖలు చేయలేదు. GAD అధికారులు చీఫ్ సెక్రటరీ సమావేశం నిర్వహించి దీనిపై న్యాయ పోరాటం చేయాలి అని దేవీప్రసాద్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వ విద్య ఉంటుందా అనే అనుమానం ఉంది: భుజంగ రావు, బీఆర్ఎస్ నేత
ప్రభుత్వ విద్య ఉంటుందా, కనుమరుగు అవుతుందో అనుమానం. ఆనాడు కేసీఆర్ విద్యా అవకాశాలు మెరుగుపరిచారు. రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత విద్యను గాలికొదిలేశారు. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. 250 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేడెట్ స్కూల్స్ కడతాం అంటున్నారు. ఆకూనురీ మురళి చెప్పినట్లు రేవంత్ నడుచుకుంటున్నారు. ఆనాడు ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలను బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించింది. రంగులు వేసి మేం కట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఉన్నటువంటి స్కూల్స్ ను ఎందుకు బాగు చేసుకోలేకపోతున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను కేసీఆర్ మెరుగుపరిచారు. నేడు 85 వేల మంది ఉపాధ్యాయులను రోడ్డు మీద వేసే అవకాశం ఉంది.
ఈ మీడియా సమావేశంలో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యురాలు ఉపేంద్ర చారి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Chamala Kirankumar Reddy | అయోధ్య ట్రస్ట్‌తో రూ.200 కోట్లు మింగిర్రు
- ●Ecuador | 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్ నాకౌట్‌కు.. నేషనల్ హాలీడే ప్రకటించిన అధ్యక్షుడు డేనియల్ నొబోవా
- ●Waterways Leisure Tourism IPO | వాటర్‌వేస్ లీజర్ టూరిజం ఐపీవోకు భారీ స్పందన.. అలాట్మెంట్ ఎప్పుడు..?
- ●Sanchita Ugale | ఆత్మహత్య చేసుకున్న తొమ్మిది రోజుల తర్వాత బాలీవుడ్ నటి అంత్యక్రియలు
- ●World drug day awareness rally | డ్రగ్స్ నిర్మూలన మా బాధ్యతే కాదు.. మనందరిది
- ●Russia-Ukraine War | రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్

Chamala Kirankumar Reddy | అయోధ్య ట్రస్ట్‌తో రూ.200 కోట్లు మింగిర్రు

Ecuador | 20 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్ నాకౌట్‌కు.. నేషనల్ హాలీడే ప్రకటించిన అధ్యక్షుడు డేనియల్ నొబోవా

Waterways Leisure Tourism IPO | వాటర్‌వేస్ లీజర్ టూరిజం ఐపీవోకు భారీ స్పందన.. అలాట్మెంట్ ఎప్పుడు..?

Sanchita Ugale | ఆత్మహత్య చేసుకున్న తొమ్మిది రోజుల తర్వాత బాలీవుడ్ నటి అంత్యక్రియలు




