త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశంలో సెక్యుల‌ర్ వ‌ర్గాల‌కు మ‌నుగ‌డ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశంలో సెక్యుల‌ర్ వ‌ర్గాల‌కు మ‌నుగ‌డ ఉంటుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. లౌకిక వ‌ర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్ల‌ప్పుడూ పోరాడుతూనే ఉంటుంద‌ని సీఎం తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Aug 13, 2026, 5.25 pm IST

CM Revanth Reddy | కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశంలో సెక్యుల‌ర్ వ‌ర్గాల‌కు మ‌నుగ‌డ : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశంలో సెక్యుల‌ర్ వ‌ర్గాల‌కు మ‌నుగ‌డ ఉంటుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. లౌకిక వ‌ర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్ల‌ప్పుడూ పోరాడుతూనే ఉంటుంద‌ని సీఎం తేల్చిచెప్పారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని కుమ్రం భీం ఆదివాసీ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మైనార్టీస్ ఎక్స‌లెన్స్ స‌మ్మిట్ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

రాష్ట్రంలో మైనార్టీల‌కు 4 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను కాంగ్రెస్ ఇచ్చింది. రాష్ట్రంలో మైనార్టీల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు. మైనార్టీ రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుకు హైకోర్టు, సుప్రీంకోర్టుల‌ను ఆశ్ర‌యించారు. కాంగ్రెస్ అంటే సెక్యుల‌ర్ పార్టీ. హిందూ, ముస్లింల‌ను రెండు క‌ళ్ల‌లా కాంగ్రెస్ చూస్తుంది. మైనార్టీ రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేయ‌డంలో మోదీ, అమిత్ షా విఫ‌ల‌మ‌య్యారు. గుజ‌రాత్‌లో మైనార్టీ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేసి చూపాల‌ని స‌వాల్ విసిరాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆర్ఎంపీ వైద్యుడు.. ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ స‌భ్యుడు..

బీఆర్ఎస్ హ‌యాంలో గ్రూప్1 నియామ‌కాల ఊసే లేదు. ఒక‌సారి నియామ‌కాలు చేప‌ట్టినా ప‌ల్లీ, బ‌టానీల్లా ప్ర‌శ్న‌ప‌త్ర‌లు విక్ర‌యించారు. డ‌బ్బులున్న వాళ్లు ప్ర‌శ్న‌ప‌త్రాలు కొనుగోలు చేస్తారు. ప్ర‌శ్న‌ప‌త్రాలు కొనుగోలు చేసిన వారి నియామ‌కానికి గ‌తంలో కృషి చేశారు. గ‌త ప్ర‌భుత్వం ఆర్ఎంపీ వైద్యుడిని ప‌బ్లిక్ స‌ర్వీస్ స‌భ్యుడిని చేసింది. త‌మ అనుయాయుల‌ను ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ స‌భ్యుల‌ను చేశారు. కాంగ్రెస్ వ‌చ్చాక ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ను ప్ర‌క్షాళ‌న చేశాం. ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌లో విద్యావంతుల‌ను నియ‌మించినం. టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్1 పోస్టుల భ‌ర్తీ చేప‌ట్టాం. గ్రూప్-1 ర‌ద్దు చేయాల‌ని సుప్రీంకోర్టు వ‌ర‌కు బీఆర్ఎస్ నేత‌లు వెళ్లారు. సుప్రీంకోర్టులోనూ మంచి లాయ‌ర్‌ను పెట్టి గ్రూప్-1 నియామ‌కాలు పూర్తి చేశాం. గ్రూప్ 2, 3, 4 పోస్టుల విష‌యంలోనూ కోర్టుల్లో పోరాడి ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

హిందూ, ముస్లింలు నాకు రెండు క‌ళ్లు

హిందూ, ముస్లింల‌ను వేర్వేరుగా చూడ‌ను.. రెండు క‌ళ్ల‌లా చూస్తా. ఎవరూ అడగకపోయినా మైనారిటీలకు దక్కాల్సిన స్థానాన్ని వారికి కల్పించాం. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చాం. నిఖ‌త్ జ‌రీన్‌కు గ్రూప్ 1 ఉద్యోగం, రూ. 3 కోట్ల ప్రోత్సాహ‌కం ఇచ్చాం. మహమ్మద్ సిరాజుద్దీన్ కోసం నిబంధనలు సవరించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. మైనారిటీ యువత చదువుతో పాటు నైపుణ్యం సంపాదించాలి. జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. నైపుణ్యం నేర్చుకోండి.. అది మీ జీవితాలను మారుస్తుంది. మీ అందరి సహకారంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నాన‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రతీ ఒక్కరూ ఒక రేవంత్ రెడ్డిగా మారాలి..

స‌ర్ పేరుతో ఓట్లు తొలగించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. బెంగాల్‌లో గెలిచామని ఇక తెలంగాణనే టార్గెట్ అని కొందరు మాట్లాడుతున్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ వదిలేశారెమో.. ఇక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు వదిలిపెట్టరని నేను చెప్పా. గల్లీ గల్లీ తిరంగండి, ఇంటింటికీ వెళ్లండి.. ప్రతీ ఒక్కరి ఓటును చెక్ చేయండి. ఏ ఒక్క అర్హుడు ఓటు హక్కును కోల్పోకుండా చూడండి. ప్రతీ ఒక్కరూ ఒక రేవంత్ రెడ్డిగా మారి ఓటు హక్కును కాపాడాలి అని సీఎం పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement