MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి
MP Vaddiraju Ravichandra | దేశ వ్యాప్తంగా ఉన్న వంట గ్యాస్ డీలర్లకు మార్జిన్ పెంచాలని కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
MP Vaddiraju Ravichandra | త్రినేత్ర.న్యూస్ : దేశ వ్యాప్తంగా ఉన్న వంట గ్యాస్ డీలర్లకు మార్జిన్ పెంచాలని కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం పార్లమెంట్ ఆవరణలో పెట్రోలియం, సహజవాయువు శాఖల మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ఎంపీ వద్దిరాజు కలిసి వినతిపత్రం సమర్పించారు.
దేశంలోని పెట్రోలియం, డీజిల్, సహజవాయువు (వంటగ్యాస్)డీలర్లు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. యునైటెడ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్‌కు చెందిన తెలంగాణ,కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీలర్ల మార్జిన్ (కమీషన్)పెంచాల్సిందిగా తనతో పాటు స్థాయీ సంఘం ఛైర్మన్ సునీల్ దత్తాత్రే తర్కరేను ఇటీవల కలిసి కోరడాన్ని కేంద్ర మంత్రి దృష్టికి ఎంపీ రవిచంద్ర తెచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లకు 8 ఏళ్ల కిందట ఖరారు చేసిన మార్జిన్ ఇప్పటికీ కొనసాగుతున్నదని, మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ వద్దిరాజు వివరించగా మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సానుకూలంగా స్పందించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్





