త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | కేసీఆర్ మీద క‌క్ష‌.. రైతు బీమా ప‌థ‌కం నిలిపివేత‌

Niranjan Reddy | బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ మీద క‌క్ష‌తో రైతుల‌కు అన్యాయం చేయ‌డం స‌రికాద‌ని మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. రైతు బీమా ఎత్తేసి.. అన్న‌దాత‌ల‌కు అన్యాయం చేస్తారా..? అని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Aug 13, 2026, 3.58 pm IST

Niranjan Reddy | కేసీఆర్ మీద క‌క్ష‌.. రైతు బీమా ప‌థ‌కం నిలిపివేత‌
Advertisement

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ మీద క‌క్ష‌తో రైతుల‌కు అన్యాయం చేయ‌డం స‌రికాద‌ని మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. రైతు బీమా ఎత్తేసి.. అన్న‌దాత‌ల‌కు అన్యాయం చేస్తారా..? అని ప్ర‌శ్నించారు.

రైతుబీమా ప్రీమియం గడువు ఆగస్ట్ 15తో ముగుస్తున్నా ఈ ప్రభుత్వం దానిని కొనసాగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. రైతుబీమా పథకం ద్వారా లక్ష 21,099 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.5909.85 కోట్ల పరిహారం అందింది అని నిరంజ‌న్ రెడ్డి గుర్తు చేశారు.

ఇందిరమ్మ బీమా పేరుతో రైతు బీమాను ఎత్తేస్తున్నారు..

ఇంటింటికి ఇందిరమ్మ బీమా పేరుతో రైతు బీమాను ఎత్తేస్తున్నారు. దానిని ప్రతి ఇంట్లో ఒకరికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. జూన్ 2 నుండి పథకం అమలు అని ప్రకటించి, కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చారు. ఇంతవరకు దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ చేయలేదు. కుంట భూమి ఉన్న ప్రతి రైతుకు కేసీఆర్ రైతుబీమా పథకం అమలు చేశారు. రైతుబీమా పథకం కోసం కుంట భూమి కొన్నవారు ఎంతో మంది ఉన్నారని తెలిపారు.

కాంగ్రెస్ సర్కారుకు రైతుల ఉసురు తగులుతుంది

ఆరు గ్యారంటీలు అని అరచేతిలో స్వర్గం చూపించి ఉన్న పథకాలను ఊడబీకారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఎత్తేశారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో కళ్యాణలక్ష్మికి కోర్టు బ్రేకులు వేసింది. ఇప్పుడు రైతు బీమాను నిలిపేస్తున్నది.. రైతు భరోసా ఇస్తారో ఇవ్వరో తెలియదు. సాగునీళ్లు ఇవ్వరు, యూరియా ఇవ్వరు, పంటలు కొనుగోలు చేయరు, మద్దతు ధర మీద ఇస్తామన్న బోనస్ ఇవ్వరు. కొనుగోళ్లలో తరుగు పేరుతో రైతు జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ కాంగ్రెస్ సర్కారుకు రైతుల ఉసురు తగులుతుంది అని నిరంజ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement