Megha Akash | ఒకే సారి ఓటీటీలోకి వచ్చిన మేఘా ఆకాష్ రెండు తెలుగు సినిమాలు
మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించిన రెండు తెలుగు సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి. ప్రేమ దేశం మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కాగా...సహకుటుంబానాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Entertainment | Published On Aug 13, 2026, 5.11 pm IST
Megha Akash | మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించిన రెండు తెలుగు సినిమాలు ఒకేసారి ఓటీటీలో రిలీజయ్యాయి. రొమాంటిక్ లవ్‌స్టోరీగా ఓ సినిమా తెరకెక్కగా...ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మరో మూవీ రూపొందింది.
ప్రేమదేశం
మేఘా ఆకాష్, త్రిగుణ్ హీరోహీరోయిన్లుగా నటించిన ప్రేమదేశం మూవీ గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీకాంత్ సిద్దం దర్శకత్వం వహించిన సినిమాలో సీనియర్ హీరో మధుబాలతో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అజయ్ కతుర్వార్, అమర్‌దీప్ చౌదరి కీలక పాత్రల్లో నటించారు. 2023లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ దాదాపు మూడేళ్ల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. ఈటీవీ విన్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లో కూడా ప్రేమదేశం అందుబాటులో ఉంది.
ఆద్యకు ప్రపోజ్...
రెండు ప్రేమకథలతో దర్శకుడు శ్రీకాంత్ ఈ సినిమాను రూపొందించారు. ఆద్య (మేఘా ఆకాష్), అర్జున్ ( త్రిగుణ్ ప్రేమించుకుంటారు. ప్రేమదేశం అనే కేఫ్‌లో ఆద్యకు ప్రపోజ్ చేయాలని అర్జున్ అనుకుంటాడు. కానీ ఓ యాక్సిడెంట్ ఇద్దరి జీవితాలను మలుపుతిప్పుతుంది. ఆద్య, అర్జున్‌లకు శివ, మాయ అనే జంట కథతో ఉన్న సంబంధమేమిటన్నదే ఈ మూవీ కథ.
సహకుటుంబానాం...
రామ్‌కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన సహకుటుంబానాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి ఉదయ్ శర్మ దర్శకత్వం వహించాడు. మణిశర్మ మ్యూజిక్ అందించాడు.
కళ్యాణ్ కథ...
కళ్యాణ్ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన అబ్బాయి. తన ఫ్యామిలీ గురించి అందరికి గొప్పగా చెబుతుంటాడు. కుటుంబానికి అతడు ఇచ్చే విలువ నచ్చి సిరి అనే అమ్మాయి కళ్యాణ్‌ను ఇష్టపడుతుంది. పెళ్లి కొద్ది రోజుల్లో ఉందనగా కళ్యాణ్ గురించి సిరికి షాకింగ్ నిజం తెలుస్తుంది? అదేమిటి? తన కుటుంబం నుంచి కళ్యాణ్ దూరంగా బతకాడానికి కారణమేమిటన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hollywood OTT | ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ది ఒడిస్సీ – ట్విస్ట్ ఏంటంటే?
ఆగస్టు 11, 2026

Kiara Advani | టాక్సిక్ తర్వాత టాలీవుడ్ – మైథాలజీ మూవీలో కియారా అద్వానీ – రౌడీ బాయ్‌తో రొమాన్స్
ఆగస్టు 10, 2026

Allu Arjun | బన్నీ , లోకేష్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ – స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్న ఐకాన్ స్టార్
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●Airtel | ప్రీపెయిడ్ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్టెల్.. ఆ 4 ప్లాన్లు తొలగింపు..
- ●Supreme Court | ఉప్పు..చక్కెర.. ఫ్యాట్ ఎంతుందో.. జనానికి తెలిసేలా డిస్ ప్లే చేయండి? ప్యాకేజ్డ్ ఫుడ్ అంశంలో కేంద్రానికి సుప్రీం అల్టిమేటం
- ●Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. 'రాంప్'పై కదిలి: మోడల్స్‌గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు
- ●Janhvi Kapoor | నో గ్లామర్ - అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ - దీపికా, రష్మికలకు ధీటుగా!
- ●MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి
- ●Stock Markets | వరుసగా నాలుగో సెషన్లోనూ మిశ్రమ ధోరణి.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

Airtel | ప్రీపెయిడ్ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్టెల్.. ఆ 4 ప్లాన్లు తొలగింపు..

Supreme Court | ఉప్పు..చక్కెర.. ఫ్యాట్ ఎంతుందో.. జనానికి తెలిసేలా డిస్ ప్లే చేయండి? ప్యాకేజ్డ్ ఫుడ్ అంశంలో కేంద్రానికి సుప్రీం అల్టిమేటం

Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. 'రాంప్'పై కదిలి: మోడల్స్‌గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు

Janhvi Kapoor | నో గ్లామర్ - అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ - దీపికా, రష్మికలకు ధీటుగా!



