త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR Camp Office | కేసీఆర్ క్యాంపు ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫొటో తొల‌గింపు

KCR Camp Office | గ‌జ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ ఏర్ప‌డింది. మొత్తానికి కేసీఆర్ క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత వంటేరు ప్ర‌తాప్ రెడ్డి తొలగించారు.

S

Telangana | Published On Apr 4, 2026, 6.07 pm IST

KCR Camp Office | కేసీఆర్ క్యాంపు ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫొటో తొల‌గింపు
Advertisement

KCR Camp Office | త్రినేత్ర‌.న్యూస్ : గ‌జ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ ఏర్ప‌డింది. మొత్తానికి కేసీఆర్ క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత వంటేరు ప్ర‌తాప్ రెడ్డి తొలగించారు. ఇక ఫొటోను తొల‌గించి నేలకేసి కొట్టే య‌త్నం చేయ‌గా, పోలీసులు అడ్డుకున్నారు. సీఎం ఫొటోను పోలీసులు లాగేసుకున్నారు.

శ‌నివారం ఉద‌యం గ‌జ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకున్న కాంగ్రెస్ నేత‌లు విధ్వంసం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్ ఫొటోను తొల‌గించి.. రేవంత్ రెడ్డి ఫొటోను ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత కిటికీల‌ను, ఫ‌ర్నీచ‌ర్‌ను ధ్వంసం చేశారు. పూల‌కుండీల‌ను ప‌గులగొట్టారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

ఎల్లుండి గ‌జ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు

కాంగ్రెస్ పార్టీ ద‌మ‌న‌కాండ‌కు నిర‌స‌న‌గా.. గ‌జ్వేల్ ప‌ట్ట‌ణ బంద్‌కు బీఆర్ఎస్ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి వంటేరు ప్ర‌తాప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై గజ్వేల్ పోలీసుల‌కు ప్ర‌తాప్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న క్యాంపు ఆఫీస్‌కు భద్రత లేకపోతే సామాన్యులకు ఎలా భద్రత ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ బంద్‌కు పిలుపునిస్తున్నామని, శాంతియుతంగా బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement