CM Revanth Reddy | మనమంతా సామాజిక బాధ్యతగా భావిస్తేనే మహిళల రక్షణ సాధ్యం: సీఎం రేవంత్
CM Revanth Reddy | అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మన బాధ్యత తీరిపోలేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మనం మహిళను శక్తితో పోలుస్తాం, అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతే ఏ రాష్ట్రానికి గౌరవం కాదని చెప్పారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మన బాధ్యత తీరిపోలేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మనం మహిళను శక్తితో పోలుస్తాం, అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతే ఏ రాష్ట్రానికి గౌరవం కాదని చెప్పారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. హైదరాబాద్ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ‘స్టాండ్ విత్ హర్’ (Stand With Her) కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. `దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌కు తెలంగాణలో ప్రజలు అధికారం ఇచ్చారు. మహిళల ప్రాధాన్యతను గుర్తించి, బాధ్యతలను అప్పగించడంలో మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. మహిళను మనం శక్తితో పోలుస్తాం. అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతే ఏ రాష్టానికి గౌరవం కాదు.
ఇంతకు ముందు మహిళల వేధింపులు కొంతవరకే పరిమితమయ్యేవి. కానీ సాంకేతిక అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలోనూ మహిళలపై వేధింపులు పెరిగిపోయాయి. అందుకే మనల్ని మనం సవరించుకుని బాధ్యతతో మెలగాల్సిన సమయం వచ్చింది. సమాజంలో చట్టాలను చేయడం, పోలీసులు పర్యవేక్షించడమే కాదు. మనమంతా సామాజిక బాధ్యతగా భావిస్తేనే మహిళల రక్షణ సాధ్యమవుతుంది. మన ఇంటి ఆడబిడ్డలకు ఎలాంటి గౌరవం ఇస్తామో.. సమాజంలో ఆడబిడ్డలను అలాగే గౌరవించాలి.
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే అందిస్తున్నాం. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరుతో అందిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించి వారికి శిల్పారామం వద్ద దుకాణ సముదాయాన్ని కేటాయించాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించి మహిళలు అదానీ, అంబానీలతో పోటీపడేలా చర్యలు చేపట్టాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశాం. పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకున్నాం. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి మహిళా శక్తి స్ఫూర్తిని చాటాం. మహిళా శక్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉంది.
దేశంలోనే తెలంగాణను మహిళలకు అంత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాలని స్టాండ్ విత్ హర్ (Stand With Her) కార్యక్రమం తీసుకున్నాం. మహిళా రక్షణకు ప్రతీ యువకుడు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవాలి. మహిళలు వంటింటి కుందేళ్లుగా కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష. మహిళల రక్షణ కోసం నిలబడి ప్రశ్నించే తత్వాన్ని అంతా పెంపొందించుకోవాలి. సోషల్ మీడియా పెరగడంతో సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. మీరు, మనం అంతా సమస్య వచ్చినపుడు స్టాండ్ విత్ హర్ అని గట్టిగా నిలబడాలి.` అని సీఎం రేవంత్ అన్నారు.
ఇవికూడా చదవండి..
నన్ను ఇంట్లోకి రానివ్వడంలేదు.. కోర్టులో మరో పిటిషన్ వేసిన విజయ్ భార్య సంగీత
దుబాయ్‌లో బంగారం చాలా చీప్.. డిస్కౌంట్ ధరలకు విక్రయాలు..
చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది : అమెరికా
ఉత్తమ నటుడు నాగచైతన్య.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



