Gold | దుబాయ్‌లో బంగారం చాలా చీప్.. డిస్కౌంట్ ధరలకు విక్రయాలు..
Gold | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ వస్తు మార్కెట్లపై ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ బంగారం వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన దుబాయ్ లో బంగారం తగ్గింపు ధరలకు లభిస్తోంది. రవాణా అంతరాయాలు, డిమాండ్ తగ్గడం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.
Gold | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ వస్తు మార్కెట్లపై ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ బంగారం వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన దుబాయ్ లో బంగారం తగ్గింపు ధరలకు లభిస్తోంది. రవాణా అంతరాయాలు, డిమాండ్ తగ్గడం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. దుబాయ్‌ను సాధారణంగా సిటీ ఆఫ్ గోల్డ్ అని పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద బులియన్ ట్రేడింగ్ మార్కెట్లలో ఇది ఒకటి. సాధారణంగా భారత్‌తో పోలిస్తే దుబాయ్‌లో బంగారం కొంచెం తక్కువ ధరకు లభిస్తుంది. కారణం అక్కడ దిగుమతి సుంకాలు, పన్నులు చాలా తక్కువగా ఉండడమే. భారత్‌లో బంగారం కొనుగోలు చేసినప్పుడు కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ వంటి పన్నులు వర్తిస్తాయి. అందువల్ల సాధారణ పరిస్థితుల్లో దుబాయ్‌లో బంగారం ధరలు భారత నగరాలతో పోలిస్తే 5 - 7 శాతం వరకు తక్కువగా ఉంటాయి.
ఔన్సుపై రూ.2700 వరకు తగ్గింపు..
అయితే ఇప్పటి పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇరాన్ సంక్షోభం తీవ్రరూపం దాల్చడంతో ఆ ప్రాంతంలోని విమాన ప్రయాణాలు నిలిపివేయబడ్డాయి. బంగారం రవాణా నెమ్మదించింద. సరుకు తరలింపు సమస్యలు పెరిగాయి. దీంతో దుబాయ్‌లోని బులియన్ వ్యాపారులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను విక్రయించడానికి డిస్కౌంట్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇతర మార్కెట్లకు సరుకు పంపడం కష్టమవుతుండటంతో నిల్వలను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఒక ఔన్సు (31.1 గ్రాములు) బంగారాన్ని రూ.2700 వరకు తగ్గింపు ధరకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ హావెన్ ఆస్తిగా కొనుగోలు చేస్తారు. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతాయి. అయితే దుబాయ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ వ్యాపారులు సరుకును మార్కెట్‌లకు పంపలేకపోవడంతో ధరలను తగ్గిస్తున్నారు.
దేశీయంగా ధరలు పెరిగే అవకాశం..
ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగ దేశం భారత్ కాగా దేశం తన బంగారం అవసరాలలో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారా పొందుతోంది. భారత్ దిగుమతి చేసుకునే బంగారం పెద్ద మొత్తంలో దుబాయ్ ద్వారా వస్తుంది. అందువల్ల అక్కడ సరఫరా మందగిస్తే భారత మార్కెట్‌పై తక్షణ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితి కొనసాగితే భారత జెమ్స్, జ్యువెలరీ రంగంలో సరఫరా సమస్యలు రావచ్చని, దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా భారత్‌లో వివాహాల సీజన్, పండుగలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదల వినియోగంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. బంగారం ధరల్లో తీవ్ర మార్పులు ఉండటంతో భారత రిటైల్ కొనుగోళ్లు ఇప్పటికే తగ్గాయి. ధరలు స్థిరపడే వరకు చాలా మంది కొనుగోలుదారులు వేచి చూస్తున్నారు.
మధ్యప్రాచ్య ప్రాంతంలో సైనిక చర్యలపై అనిశ్చితి కొనసాగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ పరిస్థితి మరింత తీవ్రమైతే బంగారం మాత్రమే కాకుండా ముడి చమురు, కరెన్సీలు, స్టాక్స్, బాండ్ మార్కెట్లు అన్నింటిపై ప్రభావం పడే అవకాశముంది. దుబాయ్‌లో తక్కువ ధరకు బంగారం లభిస్తున్నట్లు కనిపించినప్పటికీ యుద్ధ పరిస్థితి కొనసాగితే భారత్‌కు సరఫరా తగ్గి దేశీయ మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో శాంతి చర్చల ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు..
ఆగస్టు 3, 2026

BJP Ramchandar Rao- ATA | అమెరికా అభివృద్ధిలో తెలుగువారి పాత్ర ఎనలేనిది.. ఇక్కడికొచ్చి కూడా సంసృతిని కాపాడడం అభినందనీయం
ఆగస్టు 2, 2026

Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●Tiger | నడిరోడ్డుపై పెద్ద పులి.. బైకర్ ఏం చేశాడో తెలుసా..?
- ●Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?
- ●HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్
- ●Horoscope | ఆగస్టు 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించిన ఆర్థిక లాభాలు..!
- ●Nizamabad | నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫరల్ హోదా
- ●Telangana Voter List 2026 | ఓటరు జాబితా ప్రక్షాళన: ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు ఒకే పోలింగ్ బూత్

Tiger | నడిరోడ్డుపై పెద్ద పులి.. బైకర్ ఏం చేశాడో తెలుసా..?

Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?

HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్

Horoscope | ఆగస్టు 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించిన ఆర్థిక లాభాలు..!



