Revanth Reddy | ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం: సీఎం రేవంత్
Revanth Reddy | రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకుని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణను సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని చెప్పారు.
రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందిస్తూ, ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతూ, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●IMD | జూన్ 5 తర్వాతే బలమైన రుతుపవనాలు : ఐఎండీ
- ●CM Revanth Reddy | మేం పాలకులం కాదు.. మీ సేవకులం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Stock Markets | భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు..
- ●Telangana Formation Day Celebrations | పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు .. LIVE
- ●Vakiti Srihari | నారాయణపేటను అభివృద్ధి జిల్లాగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వాకిటి శ్రీహరి
- ●Revanth Reddy | గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్

IMD | జూన్ 5 తర్వాతే బలమైన రుతుపవనాలు : ఐఎండీ

CM Revanth Reddy | మేం పాలకులం కాదు.. మీ సేవకులం : సీఎం రేవంత్ రెడ్డి

Stock Markets | భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు..

Telangana Formation Day Celebrations | పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు .. LIVE




