త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | భారతదేశ ఖ్యాతిని, సంస్కృతి వైభవాన్ని ప్ర‌పంచ న‌లుమూల‌లా చాటుతున్న ఎన్నారైలు: సీఎం రేవంత్

CM Revanth Reddy | ప్ర‌వాస భార‌తీయుల దినోత్స‌వం (Pravasi Bharatiya Divas) సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రపంచ నలుమూల‌ల్లో భారతదేశ ఖ్యాతిని, సంస్కృతి వైభవాన్ని, నైతిక విలువలను ప్ర‌వాస భార‌తీయులు (NRI) గర్వంగా ప్రతిబింబిస్తున్నార‌ని చెప్పారు.

G

Telangana | Published On Jan 9, 2026, 12.42 pm IST

CM Revanth Reddy | భారతదేశ ఖ్యాతిని, సంస్కృతి వైభవాన్ని ప్ర‌పంచ న‌లుమూల‌లా చాటుతున్న ఎన్నారైలు: సీఎం రేవంత్
Advertisement

trinethra.news : ప్ర‌వాస భార‌తీయుల దినోత్స‌వం (Pravasi Bharatiya Divas) సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రపంచ నలుమూల‌ల్లో భారతదేశ ఖ్యాతిని, సంస్కృతి వైభవాన్ని, నైతిక విలువలను ప్ర‌వాస భార‌తీయులు (NRI) గర్వంగా ప్రతిబింబిస్తున్నార‌ని చెప్పారు. భిన్న దేశాల్లో నివసిస్తూ, అక్కడి సమాజాల్లో తమ ప్రతిభ, కృషి, నిబద్ధతలతో ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తూ దేశ గౌరవాన్ని నిలబెడుతున్నారని పేర్కొన్నారు.

భాష, సంప్రదాయాలు, పండుగలు, ఆచారాల ద్వారా భారతీయతను సజీవంగా ఉంచుతూ, తరతరాలకు మన సాంస్కృతిక విలువలను అందిస్తున్నారని అభినందించారు. సాంకేతిక విజ్ఞానం, విద్య, వ్యాపారం, వైద్యం, పరిశోధన, కళలు వంటి అనేక రంగాల్లో ప్రవాస భారతీయుల కృషి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోందని తెలిపారు.

భారతీయ మూలాలను మరచిపోకుండా నిలబెట్టుకుంటున్న ప్రవాస భారతీయులలోని ఆత్మవిశ్వాసం, దేశభక్తి నిజంగా ఆదర్శప్రాయమని పేర్కొంటూ, వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధిలో ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ పాత్ర కీలకమైనదని, తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising) కార్యాచరణలోనూ ఎన్నారైల భాగస్వామ్యం అవసరమన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement