CM Revanth Reddy | 30 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy | ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని సీఎం తేల్చిచెప్పారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని సీఎం తేల్చిచెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణలో ఉండే నిరుద్యోగ యువతకు ప్రయివేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పటికే ప్రభుత్వం 75 వేల ఉద్యోగాలు కల్పించింది. ఇంకా వేలాది ఉద్యోగాలు ఇచ్చినా కూడా తెలంగాణలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం. కాబట్టి ప్రయివేటు రంగంలో కూడా పెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఐఏఎస్ ఆఫీసర్‌కు వచ్చే జీతం రెండున్నర నుంచి మూడు లక్షల జీతం. కానీ అదే ఒ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం లభిస్తే ఏడాదికి ఐదు కోట్లు, పది కోట్ల ప్యాకేజీలు వస్తున్నాయి. ట్రిపుల్ ఐటీ స్టూడెంట్‌కు ఏడాదికి కోటిన్నర ప్యాకేజీ వచ్చింది అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగంలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలి. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని పునరుద్ధరిస్తున్నాం. పెద్ద పెద్ద యూనివర్సిటీలతో పోటీ పడే విధంగా మన విద్యాసంస్థలను తయారు చేయాలనుకుంటున్నాం. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కోసం కమిటీని ఏర్పాటు చేశాం. త్వరలోనే తీసుకువస్తాం అని రేవంత్ రెడ్డి అన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



