CM Revanth Reddy | తెలంగాణ అభివృద్ధికి క్యూర్, ఫ్యూర్, రేర్ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి క్యూర్, ఫ్యూర్, రేర్ పాలసీని అవలంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి క్యూర్, ఫ్యూర్, రేర్ పాలసీని అవలంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఫార్మా స్టోరీలో ఇంకో సక్సెస్ స్టోరీని సుజెన్ ఫార్మా యాజమాన్యం యాడ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం లేదా ఆనాడు ఉమ్మడి ఏపీలో 1995 నుంచి 2025 వరకు ఈ 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్ల హైదరాబాద్ నగరం ఇవాళ ప్రపంచ నగరాలతో పోటీ పడుతోంది. యువ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. జర్మన్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసి సౌత్ ఇండియాలోనే ఐవీ ఫ్లూయిడ్స్‌లో గొప్ప సంస్థను నెలకొల్పింది సుజెన్ ఫార్మా. ఈ కంపెనీ స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
క్యూర్, ప్యూర్ మీదనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, యాజమాన్యాలకు రక్షణ కల్పించడమే కాకుండా, లాభాలు వచ్చే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలని చెప్పి ఒక గ్లోబల్ సమ్మిట్‌ను ఏర్పాటు చేశాం. ఈ సమ్మిట్‌లో తెలంగాణ పాలసీ డాక్యుమెంట్‌ను కూడా విడుదల చేశాం. క్యూర్, ప్యూర్, రేర్ అనే పాలసీ విధానంతో ముందకు పోతున్నాం. పార్టీలకతీతంగా ఇలాంటి పాలసీలను స్వాగతిస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతాయి. క్యూర్, ప్యూర్ మీదనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. క్యూర్‌ను సర్వీస్ సెక్టార్‌గా, ఫ్యూర్‌ను మ్యానుఫ్యాక్చర్ సెక్టార్‌గా, రేర్ ఏరియాను అగ్రికల్చర్ ఎకానమీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రపంచంతో పోటీ పడాలి..
పాదర్శకమైన ఈ ప్రణాళికలతో ప్రపంచంతో పోటీ పడాలని నిర్ణయించాం. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్‌తో తెలంగాణ పోటీ పడుతుందని చర్చ జరుగుతుంది. కానీ ఇవాళ ఆ చర్చకు పులిస్టాప్ పెట్టి జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, న్యూయార్క్ వంటి నగరాలతో పోటీ పడాలని ఆలోచన చేస్తున్నాం. ఐఎస్‌బీ, నల్సార్ లా యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ వంటి గొప్ప సంస్థలు మన హైదరాబాద్‌లో ఉన్నాయి. నాలెడ్జ్ హబ్ తెలంగాణలో ఉంది. పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇక యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తూ, మద్దతు ఇస్తాం. పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించాలనే ఉద్దేశంతో నేను, శ్రీధర్ బాబు ఇక్కడికి వచ్చాం. బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఇదొక గొప్ప విజయం. కొవిడ్ వ్యాక్సిన్‌లో నాలుగింటిలో మూడు వ్యాక్సిన్‌లు జీనోమ్ వ్యాలీ నుంచి అందించాం అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఐటీ దిగ్గజ కంపెనీలకు మనోళ్లే సీఈవోలు..
సిలికాన్ వ్యాలీలో ఐటీ దిగ్గజ కంపెనీలు నడుస్తున్నాయంటే ఆ కంపెనీల సీఈవోలు మన ప్రాంతం నుంచి ఉన్నవారే. వరల్డ్ బ్యాంక్ చైర్మన్ సీఎండీగా ఉండే అజయ్ భంగా మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లోనే చదివారు. సత్యనాదెళ్ల, శాంతను నారాయణ, ప్రేమ్‌జీ హైదరాబాద్ పబ్లిక్ స్టూడెంట్స్. మన దగ్గర చదవుకున్న విద్యార్థులు సీఈవోలుగా రాణించారంటే ఇది గొప్ప సక్సెస్ స్టోరీ. ఈ నేపథ్యంలోనే ప్రపంచంతో పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అని రేవంత్ రెడ్డి అన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



