CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలంతా ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
CM Revanth Reddy | తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలంతా ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ ప్రత్యేకత అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతకు బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు. ప్రజల సాంస్కృతిక వైభవాన్ని, మహిళల ఐక్యతను చాటిచెప్పే బతుకమ్మ పండుగలో ఎన్నో సామాజిక అంశాలు ఇమిడి ఉన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధించే తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సీఎం తెలిపారు. బతుకమ్మ సంబురాలు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!

OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ




