త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | త‌ర‌గ‌ని మ‌ధుర జ్ఞాప‌కం.. ఈ రెండు ద‌శాబ్దాల ప్ర‌జా జీవితం.. సీఎం రేవంత్ భావోద్వేగ పోస్ట్

CM Revanth Reddy | రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) త‌న 20 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంపై భావోద్వేగంగా స్పందించారు. మిడ్జిల్ జ‌డ్పీటీసీగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించి 20 ఏళ్ల‌లోనే సీఎంగా ఎదిగారు. ఈ రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణాన్ని సీఎం రేవంత్ ఓ మ‌ధుర జ్ఞాప‌కంగా అభివ‌ర్ణించారు.

S

Telangana | Published On Jul 4, 2026, 1.02 pm IST

CM Revanth Reddy | త‌ర‌గ‌ని మ‌ధుర జ్ఞాప‌కం.. ఈ రెండు ద‌శాబ్దాల ప్ర‌జా జీవితం.. సీఎం రేవంత్ భావోద్వేగ పోస్ట్
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) త‌న 20 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంపై భావోద్వేగంగా స్పందించారు. మిడ్జిల్ జ‌డ్పీటీసీగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించి 20 ఏళ్ల‌లోనే సీఎంగా ఎదిగారు. ఈ రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణాన్ని సీఎం రేవంత్ ఓ మ‌ధుర జ్ఞాప‌కంగా అభివ‌ర్ణించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా రేవంత్ రెడ్డి స్పందించారు.

లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలను కూర్చి చెప్పినా.. తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం అని రేవంత్ అభివ‌ర్ణించారు. నాడు మిడ్జిల్‌లో రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం అని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు. ఇదే స్ఫూర్తితో, ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో, మీ అందరి ఆశీర్వాద బలంతో, భవిష్యత్‌లో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా.. అన్నింటికీ మించి రేవంతన్నగా.. మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నానని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement