CM Revanth Reddy | దేవుడే వానలు కురిపించిండు.. అఘోర పూజలపై సీఎం రేవంత్ కామెంట్స్
CM Revanth Reddy | వానలు కురవొద్దు.. కరువు రావాలని అఘోర పూజలు చేసినా.. దేవుడు మనవైపు ఉన్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేవుడే వానలు కురిపించిండు అని సీఎం పేర్కొన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : వానలు కురవొద్దు.. కరువు రావాలని అఘోర పూజలు చేసినా.. దేవుడు మనవైపు ఉన్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేవుడే వానలు కురిపించిండు అని సీఎం పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో రేవంత్ ప్రసంగించారు.
ఎల్‌నినో వచ్చింది.. తెలంగాణ మొత్తం ఎండిపోతది అన్నరు.. కానీ ఎల్లంపల్లి నిండింది.. హైదరాబాద్‌కు తాగునీటి సమస్య లేకుండా.. దేవుడే వానలు కురిపించిండు. కొంతమంది మాత్రం తమిళనాడు, కర్ణాటక పోయి అఘోర పూజలు చేశారు.. కరువు రావాలె.. జనాలు చచ్చిపోవాలె.. ఈ ప్రభుత్వం బద్నాం కావాలె.. ఇలాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా.. దేవుడు మనవైపు ఉన్నాడు.. వాళ్ల దిక్కులేడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది.. నాకు తెలివి ఉందని చెప్పను. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న అని చెప్పను. కానీ పది మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది.. అదొక్కటి చాలు నన్ను దేవుడు కాపాడాడానికి ఆశీర్వదించడానికి అని సీఎం పేర్కొన్నారు.
చేతబడి తిరగబడితే.. ఏమైతదో తెలుసు కదా..
మంచి పనులు చేయడానికి చిత్తశుద్ధి కావాలి. మంచి బుద్ది, ఆలోచన కావాలి. అందుకే ఇవాళ.. మీ మధ్యలోనే ఉంటున్నా.. ఎవరెన్ని చెప్పినా వినకండి.. అన్ని ఉన్నాకూడా అల్లుని నోట్లో శని అన్నట్టు ఉంటది.. ఇవాళ కేసీఆర్ పరిస్థితి అదే. అన్ని ఉన్నా ఆయనకు అల్లుని నోట్లో శని ఉండే ఆయనను మింగేసిండు.. ఇవాళ మింగనికే అఘోర పూజలు చేస్తున్నరు.. చేతబడి చేస్తున్నారు.. చేతబడి తిరగబడితే.. ఏమైతదో తెలుసు కదా.. ఫామ్ హౌజ్‌లో నుంచి బయటకు వెళ్లకుండా అష్ట దిగ్భందం చేస్తది అని సీఎం తెలిపారు.
మీ ఇంటి పిలగాని లాగా పని చేస్తా..
ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసుకుందాం.. ఒడిదొడుకులను ఎదుర్కొని, ఆర్థికంగా నిలదొక్కుకుని.. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపేందుకు నన్ను ఆశీర్వదించండి.. పదేండ్లు నిరంతరం మీ కోసం మీ ఇంటి పిలగాని లాగా పని చేస్తా.. అభివృద్ధి కోసం నిలబడుతాను అని సీఎం స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hyderabad Police Vehicle Auction | పోలీసులు సీజ్ చేసిన 2,193 వాహనాల వేలం.. వాటిలో మీ బైక్ లేదా కారు ఉందా?
- ●CM Revanth Reddy | అరికెపూడి గాంధీ నా జోలికి వస్తలేడు : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | విత్తేసి పొత్తు కూడాలి సుమా.. ఇందిరమ్మ ఇండ్లకు ఐదారు లక్షలు ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Mulkanoor inscription | ముల్కనూరులో 10వ శతాబ్దపు అరుదైన శాసనం లభ్యం.. చరిత్రను చెప్పే 'కాటమయ్య గుండు'
- ●CM Revanth Reddy | తెల్వని దొంగ మోదీ.. సీఎం రేవంత్ విమర్శ
- ●CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad Police Vehicle Auction | పోలీసులు సీజ్ చేసిన 2,193 వాహనాల వేలం.. వాటిలో మీ బైక్ లేదా కారు ఉందా?

CM Revanth Reddy | అరికెపూడి గాంధీ నా జోలికి వస్తలేడు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | విత్తేసి పొత్తు కూడాలి సుమా.. ఇందిరమ్మ ఇండ్లకు ఐదారు లక్షలు ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి

Mulkanoor inscription | ముల్కనూరులో 10వ శతాబ్దపు అరుదైన శాసనం లభ్యం.. చరిత్రను చెప్పే 'కాటమయ్య గుండు'



