Ramadan Wishes | ఈద్ ఉల్ ఫితర్.. ముస్లిం సోదరులకు గవర్నర్, సీఎం, కేసీఆర్ శుభాకాంక్షలు
Ramadan Wishes | పవిత్ర రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ఈద్ ఉల్ ఫితర్ (Eid-ul-Fitr) సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు (Ramadan Wishes) తెలియజేశారు.
Ramadan Wishes | త్రినేత్ర.న్యూస్: పవిత్ర రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ఈద్ ఉల్ ఫితర్ (Eid-ul-Fitr) సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు (Ramadan Wishes) తెలియజేశారు. పవిత్ర ఖురాన్ బోధనల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఖురాన్ సన్మార్గంలో నడిపిస్తూ మానవత్వం, కరుణకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు.
ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. క్రమశిక్షణతో చేసే ప్రార్థనలు, దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు.
ప్రతిరోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధలతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని, ఈ సందర్భంగా పరస్పర శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలు పరిమళిస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. లౌకికవాద విలువలకు ప్రాధాన్యమిస్తూ, విభిన్న మతాల సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ, గంగా జమునా తహజీబ్‌కు ప్రతీకగా బీఆర్‌ఎస్ పాలన కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, ప్రగతి కోసం విద్య తదితర రంగాల్లో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారి జీవన విధానంలో గుణాత్మక మార్పునకు దోహదం చేశాయన్నారు. ప్రగతి తిరిగి పుంజుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



