Tunga Balu | యాదాద్రి ట్రస్ట్ బోర్డులో స్థానికులకు చోటేది..? నిలదీసిన తుంగ బాలు
Tunga Balu | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులకు ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తుంగ బాలు తీవ్రంగా ఖండించారు.
Tunga Balu | త్రినేత్ర.న్యూస్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులకు ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తుంగ బాలు తీవ్రంగా ఖండించారు. యాదాద్రి ప్రాంతానికి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, యాదాద్రి వంటి పవిత్ర దేవస్థానం ట్రస్ట్ బోర్డులో యాదాద్రి జిల్లా నుంచి ఒక్క స్థానిక ప్రతినిధికి కూడా అవకాశం కల్పించలేకపోవడం కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
కేసీఆర్ నాయకత్వంలో దేవస్థానం అభివృద్ధి కోసం అనేకమంది రైతులు వారి జీవన ఆధారమైనటువంటి పొలాలను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ విలువైన భూములను ఇచ్చారు. ఈ యాదాద్రి అభివృద్ధి కోసం భూములను, ఇళ్లను ఇచ్చిన స్థానిక ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఆలయ సంప్రదాయాలు, స్థానిక పరిస్థితులు, అభివృద్ధి అవసరాలపై అవగాహన ఉన్న వారికే ట్రస్ట్ బోర్డులో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా, స్థానికులను పూర్తిగా విస్మరించడం బాధాకరమన్నారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా కొందరు బడా పెట్టుబడిదారులు, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులను ట్రస్ట్ బోర్డులో నియమించడం వెనుక రాజకీయ, స్వార్థ ప్రయోజనాలే ఉన్నాయని ఆరోపించారు.
ప్రపంచంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా యాదాద్రిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ కృషి చేశారు. అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం దేవస్థాన ట్రస్ట్ బోర్డును వినియోగించుకోవడం అత్యంత విచారకరం, సిగ్గుచేటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేట్ శక్తులు, బడా వ్యాపారవేత్తల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తున్నారని విమర్శించారు. యాదాద్రి ట్రస్ట్ బోర్డులో వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తుంగ బాలు డిమాండ్ చేశారు. లేకపోతే స్థానిక ప్రజలను కలుపుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని తుంగ బాలు హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల
ఆగస్టు 19, 2026

CM Revanth Reddy | కులవృత్తులను కొనసాగించండి.. సీఎం రేవంత్ పిలుపు
ఆగస్టు 18, 2026

CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి



