Ramchander Rao | అధికారాన్ని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ విధించారు : రామచందర్ రావు
Ramchander Rao | ఇందిరా గాంధీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి దేశంలో ఎమర్జెన్సీ విధించారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పేర్కొన్నారు. ఈ చారిత్రక నిజం యువతకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : ఇందిరా గాంధీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి దేశంలో ఎమర్జెన్సీ విధించారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పేర్కొన్నారు. ఈ చారిత్రక నిజం యువతకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నల్గొండలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రామచందర్ రావు పాల్గొని ప్రసంగించారు.
ఎమర్జెన్సీ అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం. ఆ అత్యవసర పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? దాని వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టం ఏమిటి? రాజ్యాంగాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు? వ్యక్తిగత, రాజకీయ స్వార్థాల కోసం అధికారాన్ని ఎలా వినియోగించారు? ఇవన్నీ ప్రస్తుత తరానికి తప్పనిసరిగా తెలియాల్సిన అవసరం ఉందని రామచందర్ రావు అన్నారు.
ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదనడంతో ఎమర్జెన్సీ
Future needs a strong foundation in the past అన్నట్లుగా, గతాన్ని తెలుసుకున్నప్పుడే భవిష్యత్తును బలంగా నిర్మించగలం. మన దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక కీలకమైన మలుపు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి రాజకీయ ప్రత్యర్థులను, ప్రజాస్వామ్య శక్తులను, విభిన్న అభిప్రాయాలను ఎలా అణచివేశారో భావితరాలు తెలుసుకోవాలి. ఎమర్జెన్సీ ఎందుకు విధించబడిందో చాలా మందికి పూర్తిగా తెలియదు. అలహాబాద్ హైకోర్టు తీర్పు అనంతరం ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని వచ్చిన నేపథ్యంలో, అధికారాన్ని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ విధించారు. ఈ చారిత్రక నిజం యువతకు తెలియాలి అని ఆయన పేర్కొన్నారు.
వారి త్యాగాల వల్లే ఈ రోజు ప్రజాస్వామ్యం నిలబడి ఉంది..
ఈరోజు మనం ఒక రాజకీయ పార్టీగా ప్రజల్లో ఆదరణ పొందుతున్నామంటే, ఎమర్జెన్సీ సమయంలో దేశం కోసం పోరాడిన యోధుల త్యాగాల వల్లే. వారి త్యాగాల వల్లే ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడి ఉంది. కాబట్టి వారిని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిదీ. కేవలం గౌరవించడం మాత్రమే కాదు, వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి. కార్యకర్తలకు చెప్పాలి. యువతలో స్పూర్తిని నింపాలి. ఆ రోజుల్లో వ్యక్తిగత భేదాభిప్రాయాలు, చిన్నచిన్న విభేదాలు అన్నీ పక్కనపెట్టి దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ ఒకే వేదికపై పోరాడారు. జైళ్లలో నిర్బంధం అనుభవించారు. పోలీసుల వేధింపులు భరించారు. అయినా వెనక్కి తగ్గలేదు అని ఆయన గుర్తు చేశారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అలవాటు కాంగ్రెస్ పార్టీది
ఈ తరం మీడియా ప్రతినిధులు కూడా ఆ రోజుల్లో జర్నలిస్టులను ఎలా వేధించారో, పత్రికల గొంతును ఎలా నొక్కారో అధ్యయనం చేయాలి. కాంగ్రెస్ పార్టీని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడగాలి. భారత సమాజానికి, భారత యువతకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మళ్లీ ఎప్పటికీ ఇలాంటి పరిస్థితులు రాకుండా రాజ్యాంగాన్ని కాపాడతామనే భరోసా దేశ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన దేశం నడిచేది రాజ్యాంగం ఆధారంగానే. రాజ్యాంగం ప్రకారమే చట్టాలు రూపొందుతున్నాయి, మార్పులు జరుగుతున్నాయి, దేశ పరిపాలన సాగుతోంది. అలాంటి రాజ్యాంగాన్ని తమ స్వార్థం కోసం మార్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అలవాటు కాంగ్రెస్ పార్టీది. పత్రికల గొంతు నొక్కే చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఇందిరాగాంధీ బీహార్ ప్రెస్ బిల్లును తీసుకొచ్చి పత్రికా స్వేచ్ఛను అణిచివేయాలని ప్రయత్నించారు. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత కూడా మళ్లీ అధికారంలోకి వచ్చాక అదే ధోరణి కొనసాగించారు. పత్రికల గొంతు నొక్కే ప్రయత్నాలను మేము అప్పుడు ఎదిరించాం, ఇప్పటికీ ఎదిరిస్తాం అని రామచందర్ రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ చేసిన తప్పులు ఎందుకు చెప్పకూడదు..?
ఎమర్జెన్సీ 19 నెలల కాలంలో జరిగిన దారుణాలు ప్రజలకు, భావితరాలకు, ముఖ్యంగా యువతకు తెలియాల్సిందే. అందుకే ప్రధాన మంత్రి మోదీ ఈ అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది భారత చరిత్రలో ఒక కీలక అధ్యాయం. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన సినీ నటుడు దేవానంద్ సినిమాల విడుదలకు కూడా ఆటంకాలు కల్పించారు. గాయకుడు కిషోర్ కుమార్ ఇందిరాగాంధీకి మద్దతుగా పాటలు పాడనని చెప్పడంతో, ఆయన పాటలను ఆకాశవాణిలో నిషేధించారు. ఆయన సినిమాలపై కూడా ఆంక్షలు విధించారు. ఇంతటి ఘోరాలు జరిగినప్పటికీ, ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పలేదు. కానీ ఈ చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలంటే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఔరంగజేబు చేసిన పనులు, షాజహాన్ పాలన గురించి చరిత్రలో చెబితే, కాంగ్రెస్ చేసిన తప్పులు ఎందుకు చెప్పకూడదు? అవి కూడా చరిత్రలో భాగమే. ప్రజలకు నిజాలు తెలియాల్సిందే అని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడడం మా బాధ్యత
రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది ఎవరో ప్రజలకు తెలుసు. నాలుగు వందల సీట్లు వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపణలు చేశారు. కానీ రాజ్యాంగాన్ని కాపాడటం మా బాధ్యత, మా నిబద్ధత. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు తగిన గౌరవం ఇవ్వడంలో ప్రధాని మోదీ విశేష కృషి చేశారు. పంచతీర్థాలను అభివృద్ధి చేయడం, స్మారకాలు నిర్మించడం, అంబేద్కర్ వారసత్వాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను ఎన్నికల్లో ఓడించింది. ఆయనను అవమానించింది. ఆయన ఎదుగుదలను అడ్డుకుంది. ఇప్పుడు మాత్రం రాజ్యాంగం పేరుతో మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది అని రామచందర్ రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Sajjan Kumar | రెచ్చగొట్టే ప్రసంగాలు, ఒక్కొక్కరికి రూ.100, పోలీసులతో కుమ్మక్కై.. సిక్కు వ్యతిరేక అల్లర్ల వెనుక సజ్జన్ పాత్ర ఇదీ
ఆగస్టు 20, 2026

Tummala Nageshwar Rao | ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయండి
ఆగస్టు 20, 2026

Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●Konda Surekha | నా కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలినవుతాను
- ●MLA Padi Kaushik Reddy | డబుల్ బెడ్రూం ఇళ్లపై ఇంత నిర్లక్ష్యమా..?
- ●Sajjan Kumar | రెచ్చగొట్టే ప్రసంగాలు, ఒక్కొక్కరికి రూ.100, పోలీసులతో కుమ్మక్కై.. సిక్కు వ్యతిరేక అల్లర్ల వెనుక సజ్జన్ పాత్ర ఇదీ
- ●Madhuri Rathod | మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి ‘రాయే లచ్చిమి’ సాంగ్ ట్రెండింగ్ - వీరిద్దరు కలిసి చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే
- ●Tummala Nageshwar Rao | ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయండి
- ●Telangana Auto Drivers Strike | కమీషన్ల దోపిడీ.. పెరిగిన ధరల భారం

Konda Surekha | నా కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలినవుతాను

MLA Padi Kaushik Reddy | డబుల్ బెడ్రూం ఇళ్లపై ఇంత నిర్లక్ష్యమా..?

Sajjan Kumar | రెచ్చగొట్టే ప్రసంగాలు, ఒక్కొక్కరికి రూ.100, పోలీసులతో కుమ్మక్కై.. సిక్కు వ్యతిరేక అల్లర్ల వెనుక సజ్జన్ పాత్ర ఇదీ

Madhuri Rathod | మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి ‘రాయే లచ్చిమి’ సాంగ్ ట్రెండింగ్ - వీరిద్దరు కలిసి చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే



