MLA Megha Reddy | చిన్నారెడ్డి వివరణ కరెక్టు లేదు.. చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి
MLA Megha Reddy | పీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఇచ్చిన వివరణ కరెక్టుగా లేదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపించారు. ఆయన వివరణలో అన్నీ అబద్ధాలే ఉన్నాయన్నారు.
MLA Megha Reddy | త్రినేత్ర.న్యూస్: పీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఇచ్చిన వివరణ కరెక్టుగా లేదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపించారు. ఆయన వివరణలో అన్నీ అబద్ధాలే ఉన్నాయన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం స్పందించారు.
చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు నేను సంతృప్తి చెందలేదు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే. క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి ఆడియో, వీడియోలు ఇచ్చాను. కమిటీ మళ్లీ పిలిస్తే వచ్చి నా వాదన వినిపిస్తా అని మేఘారెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిన్న చిన్నారెడ్డి వివరణ ఇస్తూ తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, పార్టీ లైన్ ఎనాడూ దాటలేదని, 40 ఏళ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల ఆవేదననే మాట్లాడానని పీసీసీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన తెలిసిందే.
కాగా ఈ పంచాయతీ ఢిల్లీకి.. అటు నుంచి గాంధీభవన్‌కు చేరగా చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్‌మోహన్‌కు వివరణ కూడా ఇచ్చారు. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
తాజావార్తలు
- ●Dr Gadala Srinivasa Rao | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జనసేన: డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్
- ●CM Revanth Reddy | హైదరాబాద్ వస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Revanth Reddy | లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నా.. వచ్చాక అన్నీ మాట్లాడ్తా: సీఎం రేవంత్
- ●H1N1 | హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ క్లారిటీ..!
- ●Bollywood | తమన్నాతో టీవీ నటుడి ఎంగేజ్మెంట్ - ఫొటోలు వైరల్
- ●OBC Leaders Support Konda Surekha | కాంగ్రెస్‌లో ముదురుతున్న 'కొండా' ఎపిసోడ్: సురేఖకు ఓబీసీ సంఘం అండ.. అధిష్ఠానం తీరుపై ఫైర్!

Dr Gadala Srinivasa Rao | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జనసేన: డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్

CM Revanth Reddy | హైదరాబాద్ వస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా : సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy | లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నా.. వచ్చాక అన్నీ మాట్లాడ్తా: సీఎం రేవంత్

H1N1 | హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ క్లారిటీ..!





